Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Karivepaku pulao : వాసనకే కడుపు నిండిపోయే కరివేపాకు పులావ్..ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్
పులావ్ పేరు వింటేనే కొందరికి నోట్లో నీళ్లూరుతుంటాయి. ఇక వాసన వస్తే ప్లేటు పట్టుకొని పరిగెత్తాల్సిందే. అయితే మీరెప్పుడైనా కరివేపాకు పులావ్ తిన్నారా? ఉల్లిపాయ.వెల్లుల్లి లేకుండానే తయారుచేసే కరివేపాకు పులావ్.. సౌతిండియాలో చాలా ఫేమస్,టేస్టీ వంటకం. తక్కువ సమయంలో తయారయ్యే ఈ పులావ్ లో కరివేపాకు ప్రత్యేకమైన సువాసన,రుచి ఉంటాయి. ఇది అందరికీ నచ్చుతుంది. కరివేపాకు పులావ్ ని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కరివేపాకు పులావ్ తయారీకి కావాల్సిన
పదార్థాలు
-శెనగపప్పు
-మినపప్పు
-ఆయిల్
-ఆవాలు
-ఎండుమిర్చి
-మిరియాలు
-జీడిపప్పు
-ఇంగువ
-బాస్మతి రైస్
-నీళ్లు
-జీలకర్ర
-కరివేపాకు
-గరం మసాలా

కరివేపాకు పులావ్ తయారీ విధానం
-ముందుగా ఒకటిన్నర కప్పు బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి కనీసం 20 నిమిషాలు నానబెట్టుకోవాలి.
-ఇప్పుడు పులావ్ చేసే గిన్నెను లేదా ప్రెజర్ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పచ్చి శెనగపప్పు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ మినపప్పు వేసి అవి బంగారు గోధుమ రంగులోకి వచ్చేదాకా వేయించాలి.
-తర్వాత అందులో 1 టీస్పూన్ ఆవాలు, 4 ఎండుమిర్చి, కొద్దిగా మిరియాలు, 1 టీస్పూన్ జీలకర్ర,చిటికెడు ఇంగువ వేసి వేయించాక ఇందులో 1 కప్పు కరివేపాకు, 15 జీడిపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. జీడిపప్పు బంగారు రంగులోకి మారేదాకా వేయించాలి. కరివేపాకును నూనెలో వేయించడం వల్ల దాని సువాసన పులావ్ కి పట్టుకుంటుంది.
Best Breakfast: రాగి పిండితో హెల్దీ బన్ దోశలు..పీకలదాకా తిన్నా ఇంకోటి కావాలంటారు..ఎలా చేయాలంటే
-తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన ఒకటిన్నర కప్పు బాస్మతి బియ్యం,కొద్దిగా గరం మసాలా,రుచికి సరిపడా ఉప్పు,3 కప్పుల నీళ్లు పోసి బాగా కలిపి మంటను మీడియంలో పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
-తర్వాత మూతీసి అందులో కావాలనుకుంటే కొద్దిగా నిమ్మరసం,కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. అంతే కరివేపాకు పులావ్ రెడీ. దీనిని పెరుగు,రైతా లేదా మీకు నచ్చిన కూరతో కలిపి తింటుంటే ఆ మజానే వేరే లెవల్ లో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
