Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
పోషకాలతో కూడిన స్నాక్..శరీరానికి బోలెడు శక్తినిచ్చే తాటి బూరెలు..ఎలా చేసుకోవాలంటే
తాటికాయలు అంటే సిటీల్లో ఉండే చాలామందికి ముంజలు మాత్రమే గుర్తుకొస్తాయి. ఎండాకాలం వచ్చిందంటే పల్లెటూర్లలో అయితే సరదాగా ఫ్రెండ్స్ బ్యాచ్ తాటిచెట్ల దగ్గరకు పోయి గెడకర్రతో చెట్లనుంచి తాటికాయలను దింపి వాటిలోని ముంజలను ఆస్వాదిస్తారు. వీటిని కొందరు టౌన్స్, సిటీల్లోకి తీసుకొచ్చి కూడా అమ్ముతున్నారు. అయితే తాటికాయలతో రకరకాల వంటకాలు కూడా తయారుచేసుకోవచ్చు. వేసవి చివరి నుండి వర్షాకాలం ప్రారంభం వరకు తాటిచెట్టు నుంచి లభించే పీసు తాటికాయలతో మంచి రుచికరమైన బూరెలను తయారుచేసుకోవచ్చు. తాటి బూరెలు ఒక సాంప్రదాయ, రుచికరమైన తెలుగు వంటకం. తీయగా, సువాసనగా ఉండే ఈ బూరెలు తెలుగువారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి.
తాటి బూరెలు కేవలం రుచికరమైనవి మాత్రమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. తాటి పండు గుజ్జులో ఐరన్, కాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన విటమిన్లు,మినరల్స్ ని అందిస్తాయి. మీ ఇంట్లోనే చాలా ఈజీగా ఈ తాటి బూరెలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తాటి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-తాటి పండు గుజ్జు: 1 కప్పు (2-3 పండ్ల గుజ్జు)
-బియ్యప్పిండి: 1 నుండి 1.5 కప్పులు
-బెల్లం తురుము: 1/2 నుండి 3/4 కప్పు
-యాలకుల పొడి: 1 టీస్పూన్
-ఎండు కొబ్బరి తురుము: 1/4 కప్పు
-నూనె: వేయించడానికి సరిపడా
తయారీ విధానం
-ముందుగా బాగా పండిన, మంచి వాసన వచ్చే పీసు తాటి పండ్లను శుభ్రంగా
కడగాలి. తాటి పండు పైనున్న గట్టి తొక్కను జాగ్రత్తగా తొలగించాలి.
-పండు లోపల 2-3 గింజలు ఉంటాయి. ఈ గింజలను తీసి వాటిపై ఉండే పీచు పదార్థంతో కూడిన గుజ్జును వేరు చేయాలి.
-ఈ గుజ్జును ఒక పెద్ద జల్లెడ లేదా చిల్లుల గిన్నెలో వేసి కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ చేత్తో బాగా పిసకాలి. ఇలా చేయడం వల్ల పీచు పదార్థం జల్లెడలో ఉండిపోయి, శుభ్రమైన గుజ్జు కిందకు వస్తుంది.
-గుజ్జు మరీ పల్చగా కాకుండా, కొద్దిగా చిక్కగా ఉండేలా చూసుకోవాలి.
-ముందుగా తీసిన తాటి పండు గుజ్జును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం గుజ్జులో పూర్తిగా కరిగే వరకు చేత్తో కలపండి.
-బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఎండు కొబ్బరి బూరెల రుచిని చాలా పెంచుతుంది.
-ఇప్పుడు కొద్దికొద్దిగా బియ్యప్పిండిని తాటి గుజ్జు మిశ్రమంలో వేసుకుంటూ కలపాలి.
-బూరెల పిండి మరీ పల్చగా, మరీ గట్టిగా కాకుండా చపాతీ పిండి కంటే కొద్దిగా మెత్తగా, మృదువుగా ఉండాలి. పిండిని కనీసం 5-10 నిమిషాలు బాగా కలిపితే బూరెలు మృదువుగా వస్తాయి.
-ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకొని, కలిపిన పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకోండి. అరచేతిలో లేదా ఒక ప్లాస్టిక్ షీట్ పైన చిన్న వడల్లాగా లేదా పూరీల్లాగా వత్తండి. మరీ మందంగా,మరీ పల్చగా కాకుండా సమానంగా ఉండేలా చూసుకోండి.
-స్టవ్ మీద డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పెట్టి వేడి చేయండి. నూనె బాగా వేడెక్కాక అందులో వత్తుకున్న బూరెలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా నూనెలో వేయాలి. మంటను మీడియంలో ఉంచాలి.
-బూరెలు రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
-వేగిన బూరెలను నూనె నుండి తీసి, టిష్యూ పేపర్‌పై వేయండి,దీంతో అదనపు నూనె పీల్చుకుంటుంది. వేడి వేడి తాటి బూరెలు రెడీ. చల్లారిన తర్వాత కూడా ఇవి రుచిగానే ఉంటాయి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications