Latest Updates
-
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.!
పండిన అరటిపండ్లు పారేయకండి..ఇలా కమ్మటి బోండాలు చేసుకోండి!
సాయంత్రం వేళ చల్లని గాలి వీస్తుంటే చేతిలో వేడి వేడి టీ లేదా కాఫీ ఉంటే ఎంత బాగుంటుందో. సరిగ్గా ఇదే సమయానికి పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వస్తారు, లేదా ఆఫీస్ పని ముగించుకుని రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఆ సమయంలో ఏదైనా వేడిగా, రుచిగా తినాలి అని మనసు కోరుకోవడం సహజం.
అలాంటప్పుడు వంటింట్లో గంటల తరబడి శ్రమించకుండా కేవలం 10-15 నిమిషాల్లో అయిపోయే హెల్దీ స్నాక్ గోధుమ పిండి అరటిపండు బోండా. పండిన అరటిపండ్లు, గోధుమ పిండి కాంబినేషన్ ఈ బోండాలకు అదిరిపోయే రుచిని ఇస్తుంది. ఒక్కసారి చేసి పెడితే మీ పిల్లలు మళ్లీ మళ్లీ అడుగుతారు. నోరూరించే ఈ తీపి బోండాలను ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2 కప్పులు
పండిన అరటిపండ్లు: 2
బెల్లం తురుము: ముప్పావు కప్పు
నీళ్లు: అర కప్పు
యాలకుల పొడి: అర టీస్పూన్
వంట సోడా: పావు టీస్పూన్
ఉప్పు: చిటికెడు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ముప్పావు కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టండి. బెల్లం పూర్తిగా కరిగితే చాలు, పాకం రానవసరం లేదు. బెల్లం కరిగాక స్టవ్ ఆపేసి, ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.
-ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో రెండు అరటిపండ్లను తొక్క తీసి వేయండి. వీటిని చేత్తో లేదా ఫోర్క్ స్పూన్ సహాయంతో మెత్తని గుజ్జులా అయ్యేలా బాగా మెదపాలి. అరటిపండు ముక్కలు లేకుండా చూసుకోండి.
-మెదిపి ఉంచుకున్న అరటిపండు గుజ్జులో 2 కప్పుల గోధుమ పిండి, మంచి సువాసన కోసం యాలకుల పొడి, వంట సోడా,చిటికెడు ఉప్పు వేయాలి.
-ఇప్పుడు ముందుగా కరిగించి చల్లార్చుకున్న బెల్లం నీళ్లను వడపోస్తూ
పిండిలో పోయాలి. చేత్తో పిండిని బాగా కలపాలి. బోండాల పిండి మరీ జారుగా
కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇడ్లీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలా
చూసుకోవాలి.
అవసరమైతే మరికొన్ని నీళ్లు చల్లి కలపండి.
-స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి. నూనె వేడెక్కాక, మంటను మీడియంలో ఉంచండి. ఇప్పుడు చేతిని కాస్త నీటిలో తడిపి, పిండిని చిన్న చిన్న బంతులుగా నూనెలో వేయాలి.
-మంట ఎక్కువగా ఉంటే పైన రంగు వస్తుంది కానీ లోపల ఉడకదు, కాబట్టి మీడియం మంట మీదే వేయించాలి. గరిటతో అటు ఇటు తిప్పుతూ బోండాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించాలి.
-క్రిస్పీగా వేగిన బోండాలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి. అంతే గుమగుమలాడే, మెత్తటి గోధుమ పిండి అరటిపండు బోండాలు రెడీ. వీటిని వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications