Latest Updates
-
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్! -
ఉల్లి, వెల్లుల్లి తినని వారికి బెస్ట్ ఛాయిస్.. సోయా వెజ్ ఖీమాతో బార్లీ దోశ -
వేంకటేశ్వరుడు మర్త్యలోకంలోకి ఎందుకు వచ్చాడు? అద్భుతమైన పురాణ కారణం -
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.?
స్వీట్ షాపు స్టైల్ జాంగిరీ..జ్యూసి జ్యూసీగా అదిరిపోయే టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే
జాంగిరీని స్వీటు షాపులో చూస్తుంటూనే నోట్లో నీళ్లూరుతుంటాయి. దాన్ని అలా నోట్లో పెట్టి కొరుకుతుంటే నోటికి స్వర్గం కనబడుతుంది. అందుకే ఇది పాపులర్ ఇండియన్ స్వీట్ గా మారిపోయింది. దీనికి నూనెలో వేయించడం వలన పైన క్రిస్పీగా, లోపల మెత్తగా, రసం నిండిన అల్లిక వస్తుంది. పండుగలు, శుభకార్యాలు, ప్రత్యేక సందర్భాలలో ఇది తప్పనిసరిగా ఉంటుంది. జాంగిరీ అనేది కేవలం ఒక స్వీట్ మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి. దీని తియ్యటి రుచి, ప్రత్యేకమైన అల్లిక తరతరాలుగా భారతీయుల మనసులను దోచుకుంటున్నాయి. స్వీట్ షాపు స్టైల్ లో రుచికరమైన జ్యూసీ జాంగిరీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
జాంగిరీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-బియ్యం
-ఫుడ్ కలర్
-మైదా
-శెనగపిండి
-కార్న్ ఫ్లోర్
-చక్కెర
-నిమ్మ రసం
-ఆయిల్

జాంగిరీ తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మినపప్పు,పావుకప్పు బియ్యం వేయండి. నీళ్లు పోసి శుభ్రంగా కడిగి గంటలు నానబెట్టాలి.
-తర్వాత నానిన మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో వేసి నీళ్లు కలుపుకుంటూ మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత గ్రైండ్ చేసిన మిశ్రమన్ని ఓ గిన్నెలోకి తీసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ మైదా,2 చిటికెళ్ల ఫుడ్ కలర్, పావు కప్పు శెనగ పిండి, పావు కప్పు కార్న్ ఫ్లోర్(మొక్కజొన్న పిండి)వేసి తగినన్ని నీళ్లు కలుపుకుంటూ పిండిని 4 నిమిషాలు బాగా బీట్ చేయాలి. ఇడ్లీ పిండి, బోండా పిండి మాదిరి ఇది కొంచెం గట్టిగానే ఉండాలి.
-తర్వాత స్టవ్ మీద గిన్నె లేదా పాన్ పెట్టి అందులో అరకేజీ చక్కెర, 200 ml నీళ్లు పోసి జిగురు పాకం వచ్చేదాకా మరిగించాలి. తీగ పాకం రాకూడదు.
-పాకం మరుగుతున్న సమయంలోనే అందులో చిన్న పటిక ముక్క అందులో వేసుకోండి. పటిక లేకుంటే 1 టీస్పూన్ నిమ్మరసం వేసి అయినా కలుపుకోవచ్చు.
-ఆముదం మాదిరి చిక్కని పాకం రాగానే స్టవ్ ఆపేసి దించేయాలి.
-తర్వాత కవరులో లేదా పాల ప్యాకెట్ ని పైన చీల్చి అందులో రెడీ చేసుకున్న పిండి నింపి, ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి.
-ఒక వెడల్పాటి, లోతైన కడాయిలో నూనెను మధ్యస్థ వేడి మీద వేడి చేయండి.
-వేడి నూనెలో జాంగిరీ ఆకారాన్ని జాగ్రత్తగా వేయండి. గుండ్రంగా చుట్టి, లోపల చిన్న చిన్న వలయాలు ఉండేలా చూసుకోండి.
-ఒకసారి 3-4 జాంగిరీలను మాత్రమే వేయాలి, కడాయి నిండా వేయకూడదు.
-రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించాలి.
-వేగిన జాంగిరీలను నూనెలోంచి తీసి నేరుగా వేడిగా ఉన్న చక్కెర పాకంలో వేయండి.
-జాంగిరీలను పాకంలో కనీసం 5-7 నిమిషాలు నానబెట్టాలి. అవి పాకాన్ని బాగా పీల్చుకునేలా సమయమివ్వాలి.
-పాకాన్ని పీల్చుకున్న తర్వాత జాంగిరీలను తీసి సర్వ్ చేసుకోవడమే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications