Latest Updates
-
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
అమ్మమ్మల నాటి రుచి..కమ్మనైన నేతి కొబ్బరి రొట్టె తయారీ ఇలా!
తెలుగు వారి వంటగదిలో సంప్రదాయ వంటకాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ అల్పాహారం లేదా సాయంకాలం స్నాక్ విషయానికి వస్తే, పాతకాలపు వంటకాలు ఆరోగ్యానికి, రుచికి పెట్టింది పేరు. అటువంటి ఒక అద్భుతమైన, సరళమైన వంటకం కొబ్బరి రొట్టె. ఈ రొట్టె చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఎన్నో పోషక విలువలను కలిగి ఉంటుంది.
కొబ్బరి రొట్టె అనేది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, ఇది మన తెలుగు సంస్కృతిలో భాగం. దీని తయారీకి వాడే పదార్థాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. మీ జిహ్వకు రుచిని, మీ శరీరానికి ఆరోగ్యాన్ని అందించే కొబ్బరి రొట్టెను మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం
-పచ్చిశెనగపప్పు
-పచ్చి కొబ్బరి
-బెల్లం
-నెయ్యి
-ఉప్పు
-యాలకల పొడి
తయారీ విధానం
-ముందుగా 1 కప్పు బియ్యంని శుభ్రంగా కడిగి నీరు పూర్తిగా వంపేయాలి. కడిగిన బియ్యాన్ని మూతపెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
-2 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పును కూడా 10 నిమిషాలు నీళ్లు పోసి నానబెట్టాలి.
-తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. మరీ పేస్ట్ లా కాకుండా కొబ్బరి కొంచెం తగిలేలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత పక్కన ఉంచిన బియ్యం కొంచెం పొడి పొడిగా అయ్యాక వీటిని మిక్సీ గిన్నెలో వేసి సన్నటి రవ్వలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు, గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి తురుము, నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల పచ్చి శెనగపప్పు వేసి ఒకసారి బాగా కలిపి ఉడికించండి.
-జస్ట్ బెల్లం కరిగిపోయి ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యాక అందులోనే పావు టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ యాలకల పొడి వేసి ఒకసారి కలపండి.
-ఇప్పుడు మంటను తగ్గించి కడాయిలో గ్రైండ్ చేసిన బియ్యం రవ్వను వేసి కలిపాక ఇందులోనే 1 టీస్పూన్ నెయ్యి కూడా వేసి బాగా కలపాలి. కొంచెం గట్టిపడేంత వరకు ఉడికించి కడాయిని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు కొబ్బరి రొట్టె చేయడానికి వెడల్పుగా,ఫ్లాట్ గా ఉండే పాన్ ని స్టవ్ మీద పెట్టి అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి పాన్ ని బాగా వేడి చేశాక మరో 2 టీస్పూన్ల నెయ్యి పాన్ లో వేసి వేడయ్యాక ఇందులో ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న పిండి మిశ్రమం వేసి పైపైన సమానంగా స్ప్రెడ్ చేసి మూతపెట్టి 15 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి.
-అంచులు మంచిగా బంగారు రంగులోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత కొబ్బరి రొట్టెను మరో పక్కకు అట్లకాడతో తిప్పి వేసి మీడియం మంట మీద 5 నిమిషాలు ఫ్రై చేయండి. కిందభాగ కొంచెం కలర్ వచ్చిందంటే రెడీ అయిపోనట్లే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
