Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
అమ్మమ్మల ఆరోగ్య రహస్యం..సంప్రదాయ మాడుపు కారం.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే
మన ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ సంస్కృతిలో పడి, మన పూర్వీకులు మనకు అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపదను మరచిపోతున్నాం. వంటిల్లే వైద్యశాలగా భావించిన ఆ రోజుల్లో, ప్రతి వంటకానికి వెనుక ఒక ఆరోగ్య సూత్రం దాగి ఉండేది.
అమ్మమ్మలు, నానమ్మలు కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంటకాలు చేసేవారు. అలాంటి అద్భుతమైన, ఔషధ గుణాల గని అయిన వంటకాల్లో ఒకటి మాడుపు కారం. ఇది అనేక అనారోగ్యాలకు సంజీవని. ముఖ్యంగా బాలింతలకు, జలుబు, దగ్గుతో బాధపడేవారికి ఇది ఒక వరం.

కావలసిన పదార్థాలు
ఎండు మిరపకాయలు - 250 గ్రాములు
ధనియాలు - 100 గ్రాములు
జీలకర్ర - 50 గ్రాములు
మిరియాలు - 25 గ్రాములు
మెంతులు - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - 1 టేబుల్ స్పూన్
వాము - 2 టేబుల్ స్పూన్లు
శొంఠి - 20 గ్రాముల ముక్క
పిప్పళ్ళు - 10 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు - 2 పెద్ద గడ్డలు
చింతపండు -నిమ్మకాయంత
కరివేపాకు - 4 రెమ్మలు
ఇంగువ - అర టీస్పూన్
కల్లు ఉప్పు - రుచికి సరిపడా
నువ్వుల నూనె లేదా వేరుశెనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారీ విధానం
-ముందుగా అన్ని దినుసులను శుభ్రం చేసుకుని వాటిలో రాళ్లు, పుల్లలు లేకుండా చూసుకోవాలి. శొంఠిని చిన్న ముక్కలుగా దంచుకోవాలి.
-ఒక మందపాటి ఇనప మూకుడు పొయ్యి మీద పెట్టాలి. నూనె వేయకుండానే ఒక్కో దినుసును విడివిడిగా వేయించుకోవాలి. మొదటగా ఎండు మిరపకాయలుతొడిమలతో పాటే వేసి, అవి నల్లగా రంగు మారే వరకు, ఘాటైన వాసన వచ్చేవరకు సన్నని మంట మీద వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత ధనియాలను మూకుడులో వేసి నలుపు రంగులోకి మారే వరకు వేయించి తీసేయాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసి తక్కువ మంట మీద చిటపటలాడుతూ, రంగు మారేవరకు వేయించి తీసేయాలి.
-తర్వాత మిరియాలు, వాము, పిప్పళ్ళను మూకుడులో వేసి దోరగా, సువాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు మూకుడులో ఒక స్పూన్ నూనె వేసి పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బలను వేసి అవి మెత్తబడి, పై పొట్టు కొద్దిగా నల్లబడే వరకు వేయించాలి. తర్వాత కరివేపాకును కూడా వేసి కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
-వేయించిన దినుసులన్నింటినీ ఒక వెడల్పాటి పళ్లెంలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు పొడి చేస్తే కారం ముద్దగా వస్తుంది.
- ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఎండు మిరపకాయలు, శొంఠి, పిప్పళ్ళు, కల్లు ఉప్పు వేసి కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. తర్వాత మిగిలిన దినుసులన్నీ (ధనియాలు, జీలకర్ర, మొదలైనవి) వేసి మళ్ళీ గ్రైండ్ చేయాలి. చివరగా వేయించిన వెల్లుల్లి, కరివేపాకు, చింతపండు, ఇంగువ వేసి, మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఈ మాడుపు కారాన్ని గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఆరు నెలల పాటు దాని సువాసన, రుచి, ఔషధ గుణాలు కోల్పోకుండా తాజాగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications