Latest Updates
-
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ!
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.!
రాత్రి డిన్నర్లో చాలా మందికి చపాతీలు తినడం అలవాటు. చాలా తక్కువగా అన్నం తింటారు. అయితే ఒక్కోసారి చపాతీలు కొన్ని మిగిలిపోతుంటాయి. చపాతీలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే తృప్తిగా ఉంటుంది. అదే చల్లారాక లేదా ఉదయాన్నే మిగిలిపోయిన చపాతీలు తినాలంటే కొంచెం కష్టమే. కానీ ఈ సారి ఆ దిగులు వద్దు. కొత్తగా వేరే వాటితో టిఫిన్ చేయాలనే ఆలోచన చేయొద్దు. రాత్రి మిగిలిన చపాతీలతోనే ఇంట్లో అందరూ తృప్తిగా తినేలా ఈ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి. ఈ చిల్లీ చపాతీకి ఫేవరెట్ అయిపోతారు.

చిల్లీ చపాతీ తయారీకి కావాల్సిన పదార్థాలు
రాత్రి మిగిలిన చపాతీలు- ఐదు ఉంటే టేస్టీగా చేసుకోవచ్చు
నూనె- మూడు టేబుల్ స్పూన్లు
తరిగిన వెల్లుల్లి- రెండు టీస్పూన్లు
తరిగిన అల్లం- టీస్పూన్
పచ్చిమిర్చి- రెండు
ఉల్లిపాయలు- రెండు(మీడియం సైజు)
టమాటా ప్యూరీ- కప్పు
ఉప్పు- టీస్పూన్
మిరియాల పొడి- టీస్పూన్
జీలకర్ర పొడి- టీస్పూన్
సోయా సాస్- టీస్పూన్
షెజువాన్ సాస్- రెండు టీస్పూన్లు
టమాటా కెచప్- రెండు టీస్పూన్లు
క్యాప్సికం ముక్కలు- కప్పు
కొత్తిమీర- గుప్పెడు
చిల్లీ చపాతీ తయారీ విధానం
ముందుగా చపాతీలను మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్పైన పాన్ పెట్టుకుని అందులో నూనె వేసి వేడయ్యాక తరిగిన వెల్లుల్లి, అల్లం వేసి వేగనివ్వండి. తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి.

ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి రంగు మారేవరకు వేయించుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మూడు టమాటాలతో మెత్తగా చేసిన ప్యూరీ వేసుకొని కలిపి పచ్చివాసన పోయేవరకు మగ్గించుకోండి.
టమాటా ప్యూరీ వేగిన తర్వాత ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరోసారి కలిపి ఉడికించండి. తర్వాత సోయాసాస్, షెజువాన్ సాస్, టమాటా సాస్ వేసి కలిపి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
మసాలాలు వేగిన తర్వాత మీడియం సైజులో కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలను వేసుకోండి. క్యాప్సికం కలపడం ద్వారా తినేటప్పుడు క్రంచీగా, టేస్టీగా ఉంటుంది. మిశ్రమం అంతా నూనె పైకి తేలుతూ మంచిగా ఉడుకుతున్నప్పుడు కట్ చేసిన చపాతీ ముక్కలను వేయండి.
చపాతీ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేవరకు కలుపుతూ ఉండండి. ఒక ఐదు నిమిషాల పాటు సన్నని మంటపైన ఇలాగే కలుపుతూ ఉడికించుకోండి. చివరిగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్టీ చిల్లీ చపాతీ రెడీ.
చపాతీలో ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సాఫీగా అవుతుంది. త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
