Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
దీపావళికి పొంగల్ ఇలా చేసుకోండి.. రుచి అదిరిపోతుంది.. ఎలా చేసుకోవాలంటే!
ఈ కార్తీక మాసంలో చాలా మంది మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయకమైన వంటలనే తింటూ ఉంటారు. కార్తీక మాసంలో పూజలో నైవేద్యం సమర్పించేందుకు వినియోగించడంతో పాటు వాటినే అల్పాహారంగా తింటూ ఉంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యమైనది పొంగల్. చాలా ఇష్టంగా తినే ఈ పొంగల్‌ను ఇంట్లోనే ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
1. ఒక కప్పు రైస్
2. అర కప్పు పచ్చ పెసరపప్పు
3. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు
4. రెండు పచ్చి మిర్చి
5. ఒక చిన్న అల్లం ముక్క పేస్ట్
6. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
7. రెండు రబ్బల కరివేపాకులు
8. తగినంత జీడిపప్పు
9. 200 గ్రాముల నెయ్యి
10. తగినంత ఉప్పు

పొంగల్ తయారీ విధానం
ముందుగా ఒక ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో కొంత నెయ్యి వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు కూడా వేసుకొని రైస్, పచ్చ పెసర పప్పును కలిపి కొద్దీ సేపు పక్కకు నానబెట్టుకోవాలి. అవి నానాక.. అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకొని.. కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి.
అనంతరం.. ఒక కడాయి తీసుకొని అందులో మిగిలిన నెయ్యిని వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, కరివేపాకులు వేసుకోవాలి. వాటిని లేత బంగారు వర్ణంలో వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అనంతరం.. మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్‌లో జీడిపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. తరువాత ఆ జీడిపప్పు మిశ్రమంతో అన్నంని కలుపుకుంటే సరిపోతుంది పొంగల్ సిద్ధమైనట్లే.
ఆ వేడి వేడి పొంగల్‌ను ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని, పూజ చేసిన తరువాత నైవేద్యం సమర్పించి.. తరువాతం మనం తింటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వారు లొట్టలేసుకుని తినడంతో పాటు ఇంకోసారి కావాలి అని అడుగుతారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలన్నీ ఇంటర్నెట్లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది, అలాగే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉండదు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
