Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
తక్కువ మటన్ తో ఎక్కువ గ్రేవీ..రుచిలో అదిరిపోయే తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం
వీకెండ్ ఎప్పుడొస్తుందా? మటన్ ఎప్పుడు తిందామా? అని ఎదురుచూసేవాళ్లు చాలామందే ఉంటారు. అయితే ప్రతివారం ఒకేరకమైన మటన్ కర్రీలు తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈసారి తెలంగాణ ప్రాచీన వంటకం మటన్ దప్పలం ట్రై చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.

తక్కువ మటన్ తెచ్చుకున్నా ఎక్కువ కూర అయ్యేలా చాలా సింపుల్ మసాలాలు వేసి చేసినా కానీ మంచి ఫ్లేవర్ తో ఎంతో రుచిగా ఉండే తెలంగాణ సంప్రదాయ వంటకం మటన్ దప్పలం ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి. అన్నం, జొన్న రొట్టె, రాగి సంగటి వేటితో కలిపి తిన్నా అద్బుతంగా ఉంటుంది.
మటన్ దప్పలం తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ తో కూడిన మటన్
-యాలకలు
-లవంగాలు
-ఎండుకొబ్బరి
-బియ్యం
-దాల్చిన చెక్క
-జీలకర్ర
-ధనియాలు
-పుదీనా
-పసుపు
-టమాటో
-ఉప్పు
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి

మటన్ దప్పలం తయారీ విధానం
-మటన్ దప్పలం తయారుచేసుకోడానికి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో 4 యాలకలు, 4 లవంగాలు, చిన్న ఎందు కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్త ధనియాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టస్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి,ఇందులోనే కొన్ని నీళ్లు పోసి అరగంటసేపు వీటిని నానబెట్టుకోవాలి. ఈ సంప్రదాయ వంటకంలో జీడిపప్పు, గసగసాలు వంటివి ఏమీ వేయకుండా గ్రేవీ కొంచెం చిక్కగా రావడం కోసం బియ్యం వేస్తారు.
-తర్వాత అర కిలో బోన్ తో ఉండే మటన్ ముక్కలను శుభ్రంగా కడగాలి.
-స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో కడిగిన మటన్ ముక్కలను వేసి,ఇందులోనే పావు స్పూన్ పసుపు, అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మటన్ ముక్కలు మునిగేవరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి తక్కువ మంట మీద 4 విజిల్ప్ రానివ్వాలి. ఒక వేళ మీరు తీసుకున్నది ముదురు మటన్ అయితే మరో 2 విజిల్స్ రానివ్వండి. మటన్ నుంచి బోన్ సపరేట్ అయ్యేవరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మొత్తాన్ని నీటితో సహా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న మసాలా దినుసులన్నింటిని నీటితో సహా మిక్సీ గిన్నెలో వేసి చాలా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల వంట నూనె వేసి వేడి చేసి అందులో సన్నగా కట్ చేసిన 3 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 5 పచ్చిమిరపకాయల సన్నని ముక్కలు, కొద్దిగా పుదీనా వేసి మీడియం మంట మీద కలుపుతూ వేయిచాలి. తెలంగాణ సంప్రదాయ వంటకం కాబట్టి ఇందులో కరివేపాకు వేయరు. ఇందులోనే 1 స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేవరకు వేయించాలి.
-ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసిన 1 టమాటో ముక్కలు వేసి మూతపెట్టి నెమ్మదిగా మగ్గనివ్వాలి. తర్వాత అందులో కొంచెం అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి.
-ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసి వేయించుకున్నాక ఉడికించి పెట్టుకున్న మటన్ ను నీళ్లతో పాటుగా ఇందులో వేసుకోవాలి. ఈ కూర పులుసులా ఉంటుంది కాబట్టి నీళ్లు కొంచెం ఎక్కువే పడతాయి. అందుకే మటన్ ఉడకించిన నీళ్లన్నీ వేసుకోవాలి.ఇప్పుడు అందులోనే గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూతపెట్టి 1 విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
-ఈ కూర టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి తెలంగాణలోని కొన్ని ప్రాంతాలవాళ్లు కొద్దిగా చింతపండు పులుసు కూడా వేస్తుంటారు. మీకు అలా కావాలనుకుంటే వేసుకోవచ్చె.
-1 విజిల్ వచ్చేవరకు ఉడికించిన తర్వా స్టవ్ ఆపేయండి. అంతే మటన్ దప్పలం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications