Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
ఈ చలికాలంలో ఆరోగ్యాన్నిచ్చే అమృతం..ఇంట్లోనే స్వచ్ఛమైన పల్లీ బర్ఫీ చేసుకోండిలా
మీరు తీపి వంటకాలను ఇష్టపడేవారా? అయితే ఈ చలికాలంలో మీ జిహ్వ చాపల్యాన్ని తీర్చడమే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ఒక అద్భుతమైన స్వీట్ వేరుశెనగ బర్ఫీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మన శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఆ వెచ్చదనాన్ని, తక్షణ శక్తిని అందించడంలో వేరుశెనగలు, నువ్వులు అద్భుతంగా పనిచేస్తాయి.
మార్కెట్లో రంగులు, రసాయనాలు కలిపిన స్వీట్ల జోలికి వెళ్లకుండా, కేవలం 15-20 నిమిషాల్లో తయారయ్యే హెల్తీ వేరుశెనగ బర్ఫీ ఇంట్లోనే చేసుకోండి. పిల్లల నుండి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఆస్వాదించే వేరుశెనగ బర్ఫీ..కేవలం రుచిలోనే కాదు, పోషకాల విషయంలోనూ రారాజు. మరి ఈ పోషకమైన వేరుశెనగ బర్ఫీని ఎలా తయారు చేయాలో, దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
వేరుశెనగలు- 1 కప్పు
నువ్వులు- పావు కప్పు
బెల్లం తురుము- 1 కప్పు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి - 1 టీస్పూన్
తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి పాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి అయ్యాక, వేరుశెనగలను వేయండి. మంటను తక్కువలో ఉంచి పల్లీలు దోరగా వేగి, మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. అవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి.
-అదే పాన్ లో మరికొద్దిగా నెయ్యి వేసి నువ్వులను వేయండి. నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి జాగ్రత్తగా చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టండి.
-ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగలు చల్లారిన తర్వాత వాటిపై ఉన్న పొట్టును పూర్తిగా తీసివేయాలి.
-ఇప్పుడు పొట్టు తీసిన వేరుశెనగలు, వేయించిన నువ్వులను ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. వీటిని మరీ మెత్తని పిండిలా కాకుండా, కొంచెం బరకగా ఉండేలా పొడి చేసుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో బెల్లం తురుము లేదా చక్కెర కొద్దిగా నీళ్లు పోసి తీగ పాకం వచ్చేలా మరిగించాలి. బెల్లం(చక్కెర) పూర్తిగా కరిగి, సిరప్ చిక్కగా మారుతున్నప్పుడు మంటను తగ్గించి, సిద్ధం చేసుకున్న వేరుశెనగ-నువ్వుల పొడిని ఇందులో వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి.
-ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు చివరగా రుచిని, సువాసనను పెంచడానికి యాలకుల పొడిని, మరొక చెంచా నెయ్యిని జత చేయండి. నెయ్యి వేయడం వల్ల బర్ఫీ మృదువుగా రావడమే కాకుండా, మంచి మెరుపుతో కనిపిస్తుంది. మిశ్రమం పాన్ నుండి విడిపోతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.
-ఒక ప్లేట్ కి లేదా ట్రేకి నెయ్యి రాసి సిద్ధంగా ఉంచుకోండి. వేడివేడి మిశ్రమాన్ని ఆ ప్లేట్ లోకి తీసుకుని, సమంగా పరచండి. ఇది కొద్దిగా చల్లారి, గట్టిపడుతున్న సమయంలోనే చాకుతో మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ముక్కలను వేరు చేయండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications