Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాలంటైన్స్ స్పెషల్ హార్ట్ షేప్ కేక్..మీ ప్రేమను ఇలా తీపిగా చెప్పండి!
వాలంటైన్స్ డే అనగానే మనకు గుర్తొచ్చేవి ఎర్రటి గులాబీలు, చాక్లెట్లు, ప్రేమను వ్యక్తపరిచే బహుమతులు. అయితే నోరు తీపి చేస్తే, బంధం బలపడుతుంది అనే నానుడి మనందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రేమికుల రోజున మీ భాగస్వామికి మార్కెట్లో దొరికే కేక్ కాకుండా, మీ చేతులతో స్వయంగా చేసిన హార్ట్ షేప్ రెడ్ వెల్వెట్ కేక్ ను అందిస్తే ఆ ఆనందమే వేరు.
ఇది చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా, రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. మీ దగ్గర హార్ట్ షేప్ కేక్ టిన్ లేకపోయినా పర్వాలేదు. సాధారణ రౌండ్, స్క్వేర్ టిన్స్ ఉపయోగించి హార్ట్ షేప్ ఎలా తేవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
మైదా పిండి: 2 కప్పులు
పంచదార పొడి : ఒకటిన్నర కప్పులు
కోకో పౌడర్: 2 టేబుల్ స్పూన్లు
బేకింగ్ సోడా: 1 టీస్పూన్
ఉప్పు: చిటికెడు
నూనె లేదా వెన్న: 1 కప్పు
గుడ్లు: 2
మజ్జిగ: 1 కప్పు
వెనిగర్: 1 టీస్పూన్
వెనీలా ఎసెన్స్: 1 టీస్పూన్
రెడ్ ఫుడ్ కలర్: తగినంత
క్రీమ్ చీజ్: 200 గ్రాములు
వెన్న: 100 గ్రాములు
ఐసింగ్ షుగర్: 2 కప్పులు
వెనీలా ఎసెన్స్: 1 టీస్పూన్

తయారీ విధానం
-ముందుగా ఓవెన్ ను 180°C (350°F) దగ్గర 15 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి.
-ఒక పెద్ద గిన్నెలో మైదా, కోకో పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పును జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల ఉండలు లేకుండా పిండి సాఫీగా వస్తుంది.
-మరొక గిన్నెలో నూనె లేదా వెన్న, పంచదార పొడి వేసి బాగా కలపాలి. ఇందులో గుడ్లు లేదా పెరుగు వేసి మిశ్రమం తెల్లగా, క్రీమీగా అయ్యేంత వరకు బీటర్ తో గిలకొట్టాలి.
-ఇప్పుడు అందులో మజ్జిగ, వెనిగర్, వెనీలా ఎసెన్స్, రెడ్ ఫుడ్ కలర్ ను ఈ మిశ్రమంలో వేసి కలపాలి. ఎరుపు రంగు బాగా వచ్చేలా చూసుకోవాలి.
-ఇప్పుడు తడి మిశ్రమంలో ముందుగా జల్లించి పెట్టుకున్న పొడి పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలపాలి. కేవలం పిండి కలిసే వరకు కట్ అండ్ ఫోల్డ్ పద్ధతిలో కలపాలి.
-మీ దగ్గర హార్ట్ షేప్ టిన్ ఉంటే అందులో వేసి బేక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఒక చతురస్రాకారపు టిన్,ఒక గుండ్రని టిన్ తీసుకోండి. రెండింటికీ నూనె రాసి, మైదా చల్లి సిద్ధం చేసుకోండి. కేక్ మిశ్రమాన్ని ఈ రెండు టిన్స్ లో సమానంగా పోయండి. 180°C వద్ద 30-35 నిమిషాల పాటు బేక్ చేయండి.
-టూత్ పిక్ తో గుచ్చితే పిండి అంటుకోకుండా వస్తే కేక్ రెడీ అయినట్లే. కేక్ లను బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
-చతురస్రాకారపు కేక్ ను ఒక డైమండ్ ఆకారంలో ప్లేట్ మీద పెట్టండి.
-గుండ్రని కేక్ ను సమానంగా రెండు అర్ధ భాగాలుగా కట్ చేయండి. ఈ రెండు అర్ధ భాగాలను డైమండ్ ఆకారంలో ఉన్న స్క్వేర్ కేక్ పైభాగం వైపు రెండు పక్కలా అతికించండి. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ హార్ట్ షేప్ కనిపిస్తుంది.
-ఒక గిన్నెలో మెత్తటి వెన్న, క్రీమ్ చీజ్ వేసి స్మూత్ గా అయ్యేలా బీట్ చేయాలి. అందులో ఐసింగ్ షుగర్,వెనీలా ఎసెన్స్ వేసి గట్టిగా క్రీమ్ అయ్యే వరకు బీట్ చేయాలి. ఈ క్రీమ్ ను హార్ట్ షేప్ లో అమర్చిన కేక్ పై మొత్తం అప్లై చేయాలి.
-కేక్ ను అందంగా మార్చడానికి పైన స్ట్రాబెర్రీ ముక్కలు లేదా రెడ్ కలర్ స్ప్రింకిల్స్ చల్లవచ్చు. కేక్ ను కట్ చేసినప్పుడు మిగిలిన చిన్న చిన్న కేక్ ముక్కలను పొడి చేసి కేక్ చుట్టూ అద్దితే, ఎరుపు, తెలుపు రంగులో కేక్ అద్భుతంగా కనిపిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications