Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.!
ఒక్క చికెన్ షోర్బాతో జలుబు, దగ్గు మాయం..ఇంట్లోనే ఈజీగా చేసుకోవాలంటే..
జలుబు, దగ్గు ఉన్నప్పుడు మనం తినే ఆహారం చాలా ముఖ్యం. నోటికి ఏమీ రుచించదు, కడుపు బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏదైనా వేడి వేడిగా, సులభంగా జీర్ణమయ్యేది, పోషకాలు నిండినది తీసుకోవాలనిపిస్తుంటది. ఆ సమయంలో చికెన్ షోర్బా పర్ఫెక్ట్ ఛాయిస్ గా ఉంటుంది. ఇది ఒక రుచికరమైన సూప్..మనసుకు, శరీరానికి హాయినిస్తుంది. ఇది గొంతు నొప్పిని తగ్గిస్తుంది, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ఉండే పోషకాలు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.
చికెన్ షోర్బా అనేది ఒక రకమైన చికెన్ సూప్. ఇది సులభంగా జీర్ణమవుతుంది. చాలా తక్కువ సమయంలోనే దీనిని రెడీ చేసుకోవచ్చు. ఇందులో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, కూరగాయలు జలుబు లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, షోర్బాలో ఉండే అల్లం, వెల్లుల్లి, మిరియాలు యాంటీ ఇన్ ఫ్లమేటరీ, యాంటీమైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి జలుబు, దగ్గుకు కారణమయ్యే సూక్ష్మజీవులతో పోరాడతాయి. చికెన్ షోర్బా తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

చికెన్ షోర్బా తయారీకి కావాల్సిన పదార్థాలు
-బోన్ చికెన్
-ఉప్పు
-ఉల్లిపాయ
-పసుపు
-బిర్యానీ ఆకు
-వెల్లుల్లి
-మిరియాలు
-కొత్తిమీర
-నిమ్మరసం
-దాల్చిన చెక్క
-నెయ్యి
-యాలకలు
-అల్లం
తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా ఆయిల్ వేసి వేడి చెయ్యాలి.
-నెయ్యి వేడెక్కాక అందులో 1 చిన్న బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చి న చెక్క, 3 లవంగాలు, 2 యాలకలు వేసి కాస్త వేగనివ్వాలి.
-తర్వాత అందులో 1 ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేయించుకునేటప్పుడే కావాలనుకుంటే అందులో కొంచెం పుదీనా కూడా వేసుకోండి.
-ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో 200గ్రాముల బోన్స్ తో ఉన్న చికెన్ వేసి తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. చికెన్ వేయించుకునేటప్పుడే అందులో పావు టీస్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి.
-చికెన్ వేగే సమయంలో మిక్సీ జార్ 10 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కాడలతో సహా కొత్తిమీర, 1 ఇంచు అల్లం, 1 ఉల్లిపాయ పెద్ద ముక్కలు, 1 టీస్పూన్ మిరియాలు, 1 టీ గ్లాస్ నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి.
-చికెన్ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో గ్రైండ్ చేసిన కొత్తిమీర పేస్ట్ మొత్తాన్ని వేసేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు వేగనిస్తే పచ్చివాసన అంతా పోతుంది.
-ఇప్పుడు అందులో మంచినీళ్లు తాగే గ్లాసుతో రెండు గ్లాసుల నీళ్లు పోసి ఇందులోనే అరబద్ద నిమ్మరసం పిండుకోండి. ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఈ సమయంలోనే చెక్ చేసుకోండి.
-తర్వాత కుక్కర్ మీద మూతపెట్టి మీడియం మంట మాద విజిల్స్ రానివ్వాలి.
-4 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చికెన్ షోర్బా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications