Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
మసాలా వడలు ఇంట్లోనే ఇలా చేస్తే..ఒకటికి 10 లాగించేస్తారు.. రుచి అమోఘం!
భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం అల్పాహారం అనగానే గుర్తొచ్చే వాటిలో మసాలా వడ లేదా శనగ పప్పు వడ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. చల్లని సాయంత్రం వేళ, ఒక చేతిలో అల్లం టీ, మరో చేతిలో కరకరలాడే మసాలా వడ ఉంటే ఆ ఆనందమే వేరు.
బండి మీద దొరికే వడలు అంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం అందులో వాడే మసాలా దినుసులు, పిండి రుబ్బే విధానం. స్ట్రీట్ స్టైల్ రుచితో, మన ఇంట్లోని శుభ్రమైన నూనెతో కరకరలాడే మసాలా వడలు ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావలసిన పదార్థాలు
-పచ్చి శనగ పప్పు
-ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-అల్లం
-వెల్లుల్లి రెబ్బలు
-ధనియాలు
-జీలకర్ర
-కరివేపాకు
-కొత్తిమీర
-పుదీనా
-బియ్యం పిండి
-ఉప్పు
-నూనె
తయారీ విధానం
-ముందుగా ఒక బౌల్ లో 2 కప్పుల పచ్చిశనగపప్పు వేసి నీళ్లు పోసి 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అందులో నీళ్లు పోసి కనీసం 3 గంటలు నానబెట్టండి.
-తర్వాత నీళ్లు వంపేసి నానబెట్టిన పచ్చి శనగపప్పులో ఒక గుప్పుడు పక్కన పెట్టి మిగిలిన మొత్తాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసి పల్స్ మోడ్ లో కోర్స్ గా గ్రైండ్ చేసుకోండి. నీళ్లు అస్సలు పోయకండి.
-ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో గ్రైండ్ చేసిన పిండి,పక్కన ఉంచిన గుప్పెడు నానిన పచ్చిశెనగపప్పు,2 పెద్ద ఉల్లిపాయల ముక్కలు, 7 పచ్చిమిరపకాయల తరుగు, 5వెల్లుల్లి రెబ్బల సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు, 1 టీస్పూన్ జీలకర్ర, పావుకప్పు సన్నగా తరిగిన కరివేపాకు,పావు కప్పు పుదీనా తరుగు, పావు కప్పు కొత్తిమీర తరుగు,2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలపండి.
-చుక్క నీరు కూడా కలపకుండానే పిండిని కలుపుకోండి. ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకుల్లో నుంచి వచ్చే నీరు సరిపోతుంది. పిండి మరీ పొడిపొడిగా అనిపిస్తే, ఒక టీస్పూన్ నీళ్లు చల్లుకోండి.
-స్టవ్ వెలిగించి, కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి.
-చేతికి కొంచెం నూనె లేదా తడి రాసుకుని నిమ్మకాయ సైజు అంత పిండి ముద్దను తీసుకోవాలి. దాన్ని అరచేతిలో పెట్టి గుండ్రంగా, కాస్త పల్చగా ఒత్తుకోవాలి. వడ అంచులు మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. మధ్యలో కాస్త మందంగా, అంచులు పల్చగా ఉంటే బాగా వేగుతాయి.
-నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి వడలను నెమ్మదిగా నూనెలో జారవిడవాలి. నూనెలో వేయగానే వెంటనే గరిటెతో తిప్పకూడదు. ఒక నిమిషం పాటు వేగనివ్వాలి.
-వడలు బంగారు రంగులోకి మారి, పై పొర గట్టిపడే వరకు రెండు వైపులా తిప్పుతూ వేయించాలి. వేగిన వడలను టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకుంటే అదనపు నూనె పోతుంది. దీనిని చట్నీతో లేదా కొబ్బరి కారంతో తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








