Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హోటల్ స్టైల్ ఫిష్ పులావ్.. మీ ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా ఇలా చేసేయండి!
సాధారణంగా పులావ్, బిర్యానీ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది చికెన్ లేదా మటన్ మాత్రమే. కానీ, ఎప్పుడూ అవే తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త వెరైటీగా, ఆరోగ్యానికి మేలు చేసే చేపలతో ఫిష్ పులావ్ ట్రై చేయండి. చేపల కూర, చేపల ఫ్రై మాత్రమే కాదు.. పక్కా కొలతలతో చేపలతో చేసే పులావ్ కూడా అద్భుతంగా ఉంటుంది. హోటల్ స్టైల్ లో మీ ఇంట్లోనే ఫిష్ పులావ్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

ఫిష్ పులావ్ తయారీకి కావలసిన పదార్థాలు
నాణ్యమైన బాస్మతి బియ్యం - 2 కప్పులు
తాజా చేప ముక్కలు - అర కిలో
ఉల్లిపాయలు - 2
టొమాటోలు - 2
పచ్చిమిర్చి - 4
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పుదీనా, కొత్తిమీర - గుప్పెడు చొప్పున
కమ్మటి పెరుగు - అర కప్పు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
కారం - 1 టీస్పూన్
పసుపు - ముప్పావు టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
బిర్యానీ ఆకులు - 2
లవంగాలు - 4
యాలకులు - 3
దాల్చినచెక్క - ఒక అంగుళం ముక్క
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
ఫిష్ పులావ్ తయారీ విధానం
-ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పులావ్ పొడిపొడిగా వస్తుంది.
-మరోవైపు చేప ముక్కలను శుభ్రం చేసుకుని, వాటికి కొద్దిగా పసుపు, కారం, ఉప్పు పట్టించి 15 నిమిషాల పాటు పక్కన ఉంచండి. దీనివల్ల ముక్కల లోపలి వరకు ఉప్పు, కారం వెళ్లి రుచిగా ఉంటాయి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి ప్యాన్ స్టవ్ పై పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేయాలి. మసాలాల సువాసన రాగానే.. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
-ఉల్లిపాయలు వేగాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా ఆకులు వేసి టొమాటోలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు అందులో పెరుగు, ధనియాల పొడి, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. తర్వాత పక్కన పెట్టుకున్న చేప ముక్కలను వేసి చాలా సున్నితంగా కలుపుకోవాలి.
-చేప ముక్కలు మసాలాతో కలిశాక నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, పైన కొద్దిగా గరం మసాలా వేయాలి. బియ్యానికి తగినన్ని నీళ్లు (ఒక కప్పు బియ్యానికి కప్పున్నర నీళ్లు చొప్పున) పోసి మూతపెట్టి సన్నని మంటపై ఉడికించాలి.
-అన్నం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర, నిమ్మరసం పైన చల్లుకుని మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. అంతే ఎంతో రుచికరమైన, ఘుమఘుమలాడే ఫిష్ పులావ్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications