Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రాత్రి అన్నం మిగిలిపోతే పొద్దున్నే ఇలా పునుగులు చేయండి..టేస్ట్ అదరహో
ఇంట్లో వండిన అన్నం మిగిలిపోతే ఏం చేయాలో తెలియక చాలామంది సతమతమవుతుంటారు. దాన్ని పడేయం ఇష్టం ఉండదు, మళ్లీ అలాగే తినాలంటే అంతగా రుచి ఉండదు. ఇలాంటి సమయంలో చాలామంది ఎంచుకునే ఆప్షన్ పులిహోర చేయడం..మరికొందరు అయితే టమాటో రైస్ కూడా చేస్తుంటారు. అయితే మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడూ అదే పులిహోర, టమాటో రైస్ చేసి,తినడం కూడా కూడా చాలామందికి బోర్ వస్తుంది. కాబట్టి ఈసారి అన్నం మిగిలిపోయితే ఓ సారి పునుగులు చేసి చూడండి. దీనిని తయారుచేయడం కూడా నిమిషాల్లో పని. పునుగులు అతి తక్కువ ఖర్చుతో ఈజీగా తయారుచేసుకోగల స్నాక్. మిగిలిపోయిన అన్నంతో పునుగులు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
కావాల్సిన పదార్థాలు
-మిగిలిపోయిన అన్నం
-ఉప్పు
-వంటసోడా
-బియ్యం పిండి
-జీలకర్ర
-కరివేపాకు
-పెరుగు
-ఆయిల్
-నీళ్లు
తయారీ విధానం
-ముందుగా మిక్సీ గిన్నెలో ఒక కప్పు మిగిలిపోయిన అన్నం, అర కప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. పిండి మరీ లూజ్ గా కాకుండా దోస పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి.
-గ్రైండ్ చేసిన అన్నం మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేయండి. అందులోనే అరకప్పు పెరుగు కూడా వేసి మెత్తం బాగా కలిసేలా చేత్తో కలపండి.
-తర్వాత అందులో 1 కప్పు బియ్యం పిండి వేసి కొంచెం కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిసిపయేలా కలుపుకోవాలి.
-ఇప్పుడు అందులో 1 టీస్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు సన్నని తరుగు, చిటికెడు వంటసోడా, అర టీస్పూన్ ఉప్పు, 2 టీస్పూన్ల నీళ్లు పోసి మొత్తం అన్నీ కలిసిపోయేలా చేత్తో బాగా కలుపుకోవాలి. పునుగులు వేయడానికి వీలుగా ఉండేలా కలుపుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి తగినంత ఆయిల్ పోసి వేడి చేసి అందులో కలిపిన పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పునుగుల్లా వేసేుకోవాలి. మంచి బంగారు వచ్చేదాకా వేయించి బయటకు తీసుకోండి.
-నూనెలో నుంచి తీసిన పునుగులను టిష్యూ పేపర్ ఉంచిన ఫ్లేట్ లో వేయండి..తద్వారా అదనపు నూనె గ్రహించబడుతుంది. అంతే టేస్టీ పునుగులు రెడీ. పల్లీ చట్నీ లేదా అల్లం చట్నీ మీకు నచ్చిన చట్నీతో వేడివేడి పునుగులను ఆస్వాదించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications












