Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
పొద్దున్నే పులకించే రుచి..అసలైన కాంచీపురం ఇడ్లీ..ఎలా చేసుకోవాలంటే
ఇడ్లీ టేస్ట్ చేయని సౌతిండియన్స్ ఉండరు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలామంది ఇళ్లల్ల పొద్దున్నే తప్పనిసరిగా ఉండే బ్రేక్ ఫాస్ట్ ఐటమ్ ఇది. అయితే తమిళనా డులోని కాంచీపురం ఇడ్లీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణ ఇడ్లీ లా కాకుండా, దీనికి కొన్ని ప్రత్యేక పదార్థాలు, తయారీ పద్ధతులు ఉంటాయి. సుగంధ ద్రవ్యాలు, పోషకాలతో నిండిన ఈ ఇడ్లీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. సంప్రాయకంగా ఈ ఇడ్లీలను కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో కొలువై ఉన్న విష్ణుభగవానుడికి నైవేద్యంలా తయారుచేస్తారు. కాంచీపురం స్పెషల్ ఇడ్లీని మీ ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కాంచీపురం ఇడ్లీ తయారీకి కావలసిన పదార్థాలు
-ఇడ్లీ బియ్యం లేదా లావు బియ్యం: 2 కప్పులు
-మినపప్పు: 1 కప్పు
-శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
-కందిపప్పు: 1 టేబుల్ స్పూన్
-మిరియాలు: 1 టీస్పూన్
-జీలకర్ర: 1 టీస్పూన్
-అల్లం: 1 అంగుళం ముక్క
-పచ్చిమిర్చి: 2-3
-కరివేపాకు: కొన్ని రెబ్బలు
-ఆవాలు: 1/2 టీస్పూన్
-ఇంగువ: చిటికెడు
-నెయ్యి: 2-3 టేబుల్ స్పూన్లు
-ఉప్పు: తగినంత
-నూనె: ఇడ్లీ పాత్రలకు పూయడానికి
కాంచీపురం ఇడ్లీ తయారీ విధానం
-ముందుగా ఇడ్లీ బియ్యం, మినపప్పు, శనగపప్పు, కందిపప్పులను విడివిడిగా కడిగి కనీసం 4-6 గంటలు లేదా రాత్రంతా నానబెట్టండి.
-తర్వాత నానబెట్టిన మినపప్పును మెత్తగా, నురుగు వచ్చే వరకు రుబ్బుకోవాలి. దీనిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి.
-ఇప్పుడు నానబెట్టిన బియ్యం, శనగపప్పు, కందిపప్పు మిశ్రమాన్ని కొద్దిగా నీటిని కలుపుతూ కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి (రవ్వలాగా). దీనిని కూడా మినపపిండి ఉన్న గిన్నెలో కలపండి.
-రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పిండిని వెచ్చని ప్రదేశంలో 8-12 గంటలు పులియబెట్టండి. పిండి బాగా పొంగి, తేలికగా మారినప్పుడు ఇది ఇడ్లీ తయారీకి రెడీగా ఉందని అర్థం.
-తర్వాత ఒక చిన్న పాన్ లో నెయ్యి వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఆవాలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత, జీలకర్ర, దంచిన మిరియాలు, ఇంగువ, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఈ పోపును పులిసిన ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపండి.
-తర్వాత ఇడ్లీ పాత్రలకు నూనె లేదా నెయ్యి రాయండి. లేదా పాత్రలో అరటి ఆకులు పెట్టి వాటికి నెయ్యి లేదా నూనె రాయండి. ప్రతి అచ్చులో పులిసిన పిండిని నింపండి.
-ఇడ్లీ స్టాండ్ ను ఇడ్లీ కుక్కర్ లో ఉంచ, కుక్కర్ లో తగినంత నీరు పోసి ఆవిరిపై 10-15 నిమిషాలు ఉడికించండి. ఇడ్లీ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ గుచ్చి చూడండి. పిండి అంటుకోకపోతే ఇడ్లీ ఉడికినట్లే.
-వేడివేడి కాంచీపురం ఇడ్లీని సాంబార్, కొబ్బరి చట్నీ లేదా పుదీనా చట్నీతో కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications










