Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
రంగు చూడగానే ఆకలి పెరిగిపోతుంది, రుచి చూస్తే ఇక మాటలు రావు..నాలుగైదు పూరీలు అదనంగా తినడం ఖాయం
వీకెండ్ వచ్చిందంటే చాలు, మన వంటిల్లు ఒక చిన్నపాటి పండగ వాతావరణాన్ని సంతరించుకుంటుంది. వేడివేడిగా పొంగే పూరీలు, వాటికి జతగా ఏదైనా ప్రత్యేకమైన కూర వండుకుని కుటుంబమంతా కలిసి ఆస్వాదించే ఆనందమే వేరు. రోజూ చేసే సాధారణ బంగాళాదుంప కూర కాకుండా ఈసారి మీ పూరీల రుచిని రెట్టింపు చేసే ఒక అద్భుతమైన, కొత్త రకం గ్రేవీ ట్రై చేయండి. అదే గ్రీన్ పొటాటో గ్రేవీ.
ఒక్కసారి ఈ గ్రేవీని రుచి చూశారంటే మీ ఇంట్లో వాళ్ళు మామూలుగా తినేదానికంటే నాలుగైదు పూరీలు అదనంగా తినడం ఖాయం. ఈ అద్భుతమైన గ్రీన్ పొటాటో గ్రేవీ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలుో
తాజా కొత్తిమీర - ఒక నిండు గుప్పెడు
పుదీనా ఆకులు - 7-8
పచ్చిమిర్చి - 6
వెల్లుల్లి రెబ్బలు - 4
అల్లం - చిన్న ముక్క
వేయించిన పల్లీలు - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - చిటికెడు
బంగాళాదుంపలు - 2
నూనె - 3 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - పావు టీస్పూన్
పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
చిలికిన పెరుగు - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - పావు టీస్పూన్
గరం మసాలా - పావు టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - అవసరాన్ని బట్టి

తయారు చేసే విధానం
-ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి కోసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి ముప్పావు వంతు మెత్తగా ఉడికించుకోవాలి. పూర్తిగా మెత్తబడకుండా చూసుకోండి. ఉడికిన తర్వాత నీటిని వంపేసి ముక్కలను పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు మసాలా ముద్ద తయారుచేసుకోవాలి. ఇందుకోసం మిక్సర్ గిన్నెలో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పల్లీలు, పసుపు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి మెత్తని, చిక్కని పచ్చని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు అడుగు మందంగా ఉన్న పాన్ స్టవ్ మీద పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గులాబీ రంగులోకి వచ్చే వరకు దోరగా వేయించాలి.
-ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చని మసాలా ముద్దను అందులో వేసి, పచ్చి వాసన పోయి నూనె పైకి తేలే వరకు సుమారు 4-5 నిమిషాల పాటు తక్కువ మంట మీద బాగా వేయించాలి.
-మసాలా బాగా వేగిన తర్వాత స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి చిలికిన పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి వెంటనే బాగా కలపాలి.
-ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను వేసి మసాలా వాటికి బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. మూత పెట్టి 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
-ఆ తర్వాత మూత తీసి గ్రేవీకి కావలసిన చిక్కదనం కోసం సుమారు ఒక కప్పు నీళ్లు పోసి, గరం మసాలా చల్లి బాగా కలపాలి. మళ్లీ మూత పెట్టి నూనె చక్కగా పైకి తేలే వరకు మరో 3-4 నిమిషాలు ఉడికించాలి.
-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరతో అలంకరించి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, నోరూరించే, ఘుమఘుమలాడే పచ్చని బంగాళాదుంప గ్రేవీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
