Latest Updates
-
షుగర్ వ్యాధి వచ్చే ముందు కనబడే సంకేతాలు ఇవే! -
బిర్యానీకి మించిన రుచి..తక్కువ మసాలాలతో పిల్లలు,పెద్దలు మెచ్చే మొరాదాబాదీ చికెన్ పులావ్ ఇలా వండండి! -
India’s One Day Capital: ఒక్క రోజు మాత్రమే భారతదేశ రాజధానిగా ఉన్న నగరం ఏదో మీకు తెలుసా? -
ఇడ్లీ, దోశెలను వదలనివ్వని అద్భుతమైన మదురై స్పెషల్ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
చలికాలంలో ఈ సాంబార్ చేసుకుంటే..జలుబు, తలనొప్పి అన్నీ పరార్! -
కోట్ల ఆస్తి, డ్రైవర్ తో ఎఫైర్.. ప్రియుడి మోజులో కన్నకొడుకునే బలిచ్చిన తల్లి.. -
బజార్ స్వీట్లు ఇక ఆపేయండి.. సొరకాయతో అద్భుతమైన కలకండ్ ఇలా చేసుకోండి.. -
చలికాలంలో గొంతు నొప్పి, గరగర వేధిస్తున్నాయా? వంటింట్లో దొరికే ఈ పదార్థాలతో చిటికెలో రిలీఫ్.. -
100 ఏళ్లు గుర్తుండిపోయే పచ్చిమిర్చి పచ్చడి..ఎందులోకి అయినా అమృతమే! -
ఖాళీ స్వీట్ బాక్సులు పారేస్తున్నారా?.. ఈ ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా..
చియా సీడ్స్ (సబ్జా గింజలను పోలి ఉండే గింజలు) అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉదయం పూట తాగే స్మూతీలు లేదా బ్రేక్ ఫాస్ ట్లో తీసుకునే పుడ్డింగ్స్. కానీ చియా సీడ్స్ కేవలం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా మాత్రమే కాదు..రాత్రి పూట కూడా వీటితో అద్భుతమైన, లైట్ డిన్నర్ ని తయారు చేసుకోవచ్చు. రాత్రి పూట వంట చేసే ఓపిక లేనప్పుడు లేదా కడుపుకి హాయిగా అనిపించే ఆహారం తినాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్.

సాధారణంగా రాత్రి పూట భారీ ఆహారం తీసుకుంటే అరుగుదల సమస్యలు వస్తాయి. కానీ ఈ చియా రైతా చాలా తేలికైనది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పేగుల ఆరోగ్యానికి అత్యద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ డిన్నర్ ఆప్షన్. పొట్ట నిండిన భావన కలిగిస్తూనే, క్యాలరీలను అదుపులో ఉంచుతుంది. రాత్రి వేళ కడుపుకు చాలా తేలికగా ఉంటూనే, ఎక్కువ ప్రొటీన్, ఫైబర్ అందించే కమ్మటి చియా రైతా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
చియా రైతా తయారీకి కావాల్సిన పదార్థాలు
నానబెట్టిన చియా సీడ్స్ - 1 కప్పు
తాజా పెరుగు - 1 కప్పు
తురిమిన క్యారెట్ - కొద్దిగా
కీరదోసకాయ ముక్కలు - కొద్దిగా
కొత్తిమీర - కొద్దిగా
దంచిన అల్లం - కొద్దిగా
పచ్చిమిర్చి - మీ కారానికి తగినంత
ఉప్పు -సరిపడా
తాలింపుకి- పల్లీలు, జీడిపప్పు,నెయ్యి లేదా నూనె, ఆవాలు, జీలకర్ర.
అలంకరణ కోసం: దానిమ్మ గింజలు
చియా రైతా తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో 6-7 గంటల పాటు చియా సీడ్స్ నానబెట్టుకోవాలి.
-తర్వాత ఒక గిన్నెలో కమ్మటి పెరుగు వేసి ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. ఇప్పుడు ఆ పెరుగులో 6-7 గంటల పాటు నానబెట్టుకున్న చియా సీడ్స్ వేసి కలపాలి. ఆ తర్వాత తురిమిన క్యారెట్, కీరదోస సన్నని ముక్కలు, దంచిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా ఈ దశలోనే వేసి మిక్స్ చేయాలి.
-ఇప్పుడు అసలైన రుచి కోసం తాలింపు రెడీ చేసుకోవాలి. ఇందుకోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. పల్లీలు, జీడిపప్పు రైతాలో పంటికి తగులుతూ అద్భుతమైన క్రంచీ రుచిని ఇస్తాయి.
-రెడీ అయిన తాలింపును పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. చివరగా పైన ఎర్రటి దానిమ్మ గింజలను చల్లి అలంకరించుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, చల్లదనాన్నిచ్చే ఆరోగ్యకరమైన చియా రైతా డిన్నర్ కోసం రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
