Latest Updates
-
దీపావళికి స్పెషల్ స్వీట్.. కేవలం వేరుశెనగలతో నోట్లో వెన్నలా కరిగిపోయే పీనట్ హల్వా చేసుకోండిలా.. -
జీర్ణక్రియను మెరుగుపరిచే.. ఇడ్లీ, దోశలోకి అదిరిపోయే కొబ్బరి అల్లం చట్నీ చేసుకోండిలా.. -
Dhanteras 2026: ధనత్రయోదశి రోజు ఏ ముహూర్తంలో బంగారం కొనాలి? పూజా విధానం పూర్తి వివరాలు -
ఈ దీపావళికి ఇడ్లీలతో స్పైసీ బోటి పులుసు.. ఇలా చేస్తే రుచి అద్భుతం -
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు!
ఆరోగ్య ప్రయోజనాల అద్భుత సమ్మేళనం..పేలాల పిండి ఎలా చేసుకోవాలంటే
తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన రోజు. ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి వెళ్తాడని పురాణాలు చెబుతాయి. అందుకే ఈ రోజును శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం, విష్ణువును పూజించడం ఆనవాయితీ. ఈ ఉపవాసంలో భాగంగా చాలామంది శక్తిని కోల్పోకుండా ఉండేందుకు తేలికగా జీర్ణమయ్యే, పోషకాలు నిండిన ఆహారాలను తీసుకుంటారు. అలాంటి వాటిలో పేలాల పిండి ఒకటి. ఇది కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పౌష్టికాహారం కూడా.
తొలి ఏకాదశి రోజున పేలాల పిండిని ప్రసాదంగా స్వీకరించడం కేవలం సంప్రదాయాన్ని పాటించడమే కాదు, శరీరానికి అవసరమైన పోషకాలను, శక్తిని అందించే ఒక తెలివైన మార్గం కూడా. పేలాల పిండి తొలి ఏకాదశి ప్రసాదంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా తీసుకోవడానికి అనువైన పౌష్టికాహారం. పేలాల పిండిని మీ ఇంట్లోనే తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు,తయారీ విధానం ఇక్కడ చూడండి.

పేలాల పిండి తయారీకి కావాల్సిన పదార్థాలు
-జొన్న పేలాలు లేదా మొక్కజొన్న పేలాలు: 2 కప్పులు
-బెల్లం: 1 కప్పు
-యాలకులు: 4-5
-నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
-డ్రై ఫ్రూట్స్: కొన్ని
పేలాల పిండి తయారీ విధానం
-ముందుగా జొన్న పేలాలను లేదా మొక్కజొన్న పేలాలను తీసుకోండి. ఇవి మార్కెట్లో రెడీమేడ్ గా లభిస్తాయి లేదా ఇంట్లోనే జొన్నలు, మొక్కజొన్నలతో తయారు చేసుకోవచ్చు. పేలాలను ఒక ప్లేట్ లో వేసి, ఏమైనా రాళ్లు లేదా చెత్త ఉంటే ఏరివేయండి.
-శుభ్రం చేసిన పేలాలను మిక్సీ గిన్నెలో వేయండి. ఇందులోనే యాలకులను కూడా వేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి. ఇది రవ్వలా కాకుండా వీలైనంత మెత్తగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే కొద్దిసేపు ఆపి గరిటెతో కలిపి మళ్లీ మిక్సీ పట్టండి.
-బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకోండి లేదా దంచుకోండి.
-మెత్తగా పొడి చేసుకున్న పేలాల పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు తురిమిన బెల్లాన్ని కూడా అదే గిన్నెలో వేసి బాగా కలపండి. బెల్లం పొడి పూర్తిగా పిండిలో కలిసేలా చూసుకోండి. కొంతమంది బెల్లాన్ని కూడా పేలాలతో పాటే మిక్సీలో వేసి పొడి చేస్తారు.
-కావాలనుకుంటే వేడి చేసిన నెయ్యిని పిండిలో వేసి బాగా కలపండి. నెయ్యి వేయడం వల్ల పేలాల పిండికి మంచి రుచి వస్తుంది, మరింత పోషక విలువలు పెరుగుతాయి. అలాగే సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష) ను కూడా వేసి కలుపుకోవచ్చు.
-చేతితో పిండిని బాగా కలపండి. బెల్లం ముద్దలు లేకుండా, పిండి మొత్తం సమానంగా కలిసేలా చూసుకోండి. అవసరమైతే చేతితో కొద్దిగా నొక్కి కలపడం వల్ల బెల్లం పిండిలో బాగా కలిసిపోతుంది. అంతే రుచికరమైన, పౌష్టికాహారమైన పేలాల పిండి సిద్ధం. దీనిని వెంటనే తినవచ్చు లేదా గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
