టమాటా పచ్చడి: స్పైసీ టమోటో చట్నీ ఎలా తయారుచేయాలి?

Posted By: DEEPTHI T A S
Subscribe to Boldsky

టమాటా చట్నీ తయారీ ; ఘాటైన టమాటా పచ్చడి ఎలా తయారుచేయాలి.

ఇక్కడున్న చట్నీ జ్ఞానులందరూ రకరకాలుగా టమాటా చట్నీ చేస్తుండవచ్చు కానీ ఇక్కడ ఛెఫ్ అభిషేక్ బసు తన స్టైల్ టమాటా పచ్చడి తయారీని వివరించనున్నారు.దీన్ని పకోడీలు,వడియాలు, పరాఠాలు, చిప్స్ వంటి వేటితోనైనా కలిపి తినవచ్చు.

ఈ ఘాటైన,కొంచెం ఉప్పగా ఉండే చట్నీ టమాటాలతో తయారుచేస్తారు.ఇందులో ఉల్లి-వెల్లుల్లి ఉండదు. మీరు చేసేసి దీన్ని కొన్నిరోజులు ఫ్రిజ్ లో కూడా దాచవచ్చు.టమాటా విశ్వవ్యాప్తమైన పదార్థం కాబట్టి ఏ రకమైన ఆహారంతోనైనా తీసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ విధానం ఉంది చదవండి.

Tomato Chutney Recipe | How To Prepare Spicy Tamatar Chutney | Tamatar Chutney Recipe | Homemade Tomato Chutney Recipe
టమాటా చట్నీ తయారీ । ఘాటైన టమాటా పచ్చడి ఎలా తయారుచేయాలి । టమాటా పచ్చడి రెసిపి । ఇంట్లో చేసుకునే టమాటా చట్నీ తయారీ
టమాటా చట్నీ తయారీ । ఘాటైన టమాటా పచ్చడి ఎలా తయారుచేయాలి । టమాటా పచ్చడి రెసిపి । ఇంట్లో చేసుకునే టమాటా చట్నీ తయారీ
Prep Time
15 Mins
Cook Time
30M
Total Time
45 Mins

Recipe By: ఛెఫ్ అభిషేక్ బసు

Recipe Type: పచ్చళ్ళు

Serves: 7-8 సార్లు

Ingredients
 • టమాటాలు - 2 పెద్దవి

  అల్లం (తరిగినవి) - ½ అంగుళం

  ఎండుమిర్చి(విత్తనాలు తీసేసినవి) - 2-3

  మినపప్పు -1 చెంచా

  మిరియాలు - 4-5

  లవంగాలు - 2-3

  ఇంగువ (తప్పనిసరి కాదు) - చిటికెడు

  గ్రైండింగ్ కి నీరు - 2చెంచాలు

  నూనె - ½ చెంచా

  ఉప్పు సరిపోయేంత

  టెంపరింగ్ కోసం ;

  నూనె - ½ చెంచా

  ఎండుమిర్చి సగం చేసి విత్తనాలు తీసేసినవి - 1

  కరివేపాకు - 7 -8

  ఆవాలు - ½ చెంచా

  మెంతులు - 2నుంచి 3

  ఇంగువ - చిటికెడు

Red Rice Kanda Poha
How to Prepare
 • 1. పెనం తీసుకుని అరచెంచా నూనె వేయండి లేదా నాన్ స్టిక్ స్ప్రే కూడా వాడవచ్చు.

  2. ఒక నిమిషం కాగనిచ్చి మినపప్పు వేయండి.

  3. తక్కువ మంటలో మినపప్పును వేయించండి.

  4. గోధుమరంగులోకి మారాక, ఎండుమిర్చి, లవంగాలు, మిరియాలు, అల్లం వేయండి.

  5. ఎండుమిర్చి రంగు మారేదాక కలుపుతూ ఉండండి.

  6. టమాటాలు తీసుకుని, కడిగి, ముక్కలుగా తరగండి.

  7. వాటికి ఇంగువ వేయండి.

  8. ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. కానీ తక్కువ ఉప్పు తినటం వలన రక్తపోటు తగ్గి, నియంత్రణలో ఉంటుంది.

  9. టమాటాలు మెత్తగా అయేవరకు 6-7 నిమిషాలు తక్కువ మంటపై కలుపుతూ ఉండండి.

  10. టమాటా మిశ్రమం చల్లబడ్డాక, మిక్సిలో వేయండి.

  11. రెండు చెంచాల నీరు వేయండి.

  12. మెత్తని పేస్టులా మిక్సీ పట్టండి.

  13. అదే పెనం లేదా వేరేదాంట్లో రెండు చెంచాల నూనె వేసి ఒక నిమిషం వేడిచేయండి.

  14. ఆవాలు వేసి అవి వేగేదాకా కలపండి.

  15. అప్పుడు కరివేపాకు, మెంతులు, ఇంగువ, ఎండు మిర్చి వేయండి.

  16. కరివేపాకు వేగేదాకా కలపండి.

  17. మిక్సీపట్టిన టమాటా పేస్టును దీనికి కలపండి.

  18. తక్కువ మంటపై 3 -4 నిమిషాలు కలపండి.

  19. రుచి చూసి కావాలంటే ఉప్పును వేసుకోండి.

  20. మళ్ళీ బాగా కలపండి.

  21. టమాటా చట్నీ తయారయింది, ఇక వడ్డించండి.

Instructions
 • 1. మిక్సీ గ్రైండర్ జార్ వాడే ముందు బాగా కడగటం మర్చిపోకండి. 2. మీకు నచ్చితే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా చట్నీకి జతచేసుకోవచ్చు.
Nutritional Information
 • సరిపోయే పరిమాణం - 1 చెంచా
 • క్యాలరీలు - 26 క్యాలరీలు
 • కార్బొహైడ్రేట్లు - 6 గ్రాములు
 • చక్కెర - 6 గ్రాములు
[ of 5 - Users]