Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Ragi Burfi: రాగి పిండి,బెల్లంతో..నోట్లో వెన్నలా కరిగిపోయే రాగి బర్ఫీ..ఎలా చేసుకోవాలంటే
రాగితో రొట్టెలు, దోసెలు, ఇడ్లీలు, జావ,చపాతీ, సంగటి వంటి అనేక వంటకాలు తయారు చేయవచ్చు. ఈ జాబితాలో ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకం రాగి బర్ఫీ. ఇది ఒక సంప్రదాయ భారతీయ మిఠాయి, ఇది మైదాకు బదులుగా రాగి పిండిని ఉపయోగించి తయారు చేయబడుతుంది. రాగి బర్ఫీ రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇది సంప్రదాయ స్వీట్లకు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. రాగిలో ఉన్న అద్భుతమైన పోషక విలువలు దీనిని అందరికీ, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులకు ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా మారుస్తాయి. పాలు కూడా అవసరం లేకుండా జస్ట్ రాగిపిండి,బెల్లంతో టేస్టీ రాగి బర్పీని ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

రాగి బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
-రాగిపిండి
-బెల్లం
-యాలకల పొడి
-జీడిపప్పు
-నెయ్యి
-నీళ్లు
-బొంబాయి రవ్వ
'గోబీ ఖీర్' తో బక్రీద్ 2025 ని సెలబ్రేట్ చేయండి..నోట్లో పెట్టుకుంటే అమృతమే..ఎలా చేయాలంటే
రాగి బర్ఫీ తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 స్పూన్ల నెయ్యి వేసి వేడి చేశాక ఇందులో గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసి వేయించుకొని తీసి పక్కనపెట్టుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద ఉన్న అదే పాన్ లో 1 కప్పు రాగిపిండి, పావు కప్పు బొంబాయి రవ్వ వేసి తక్కువమంట మీద మంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేయించి పక్కనపెట్టుకోవాలి. దీనికి 8-10 నిమిషాలు పడుతుంది.
-తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో దాదాపు ఒకటింబావు కప్పు బెల్లం వేసి అందులో రెండు కప్పుల నీళ్లు పోసి మీడియం మంటమాీద బెల్లాన్ని కరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కనపెట్టుకోండి.
-ఇప్పుడు వేయించిన రాగిపిండిలో కొద్దిగా యాలకల పొడి, వేయించిన జీడిపప్పు,కాగబెట్టిన బెల్లం నీళ్లను ఫిల్లర్ చేసి పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తక్కువ మంట కలుపుతూ ఉడికించాలి.
-ఈ మిశ్రమం కొంచెం గట్టిబడిన తర్వాత అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. పాన్ నుంచి నెయ్యి సపరేట్ అయ్యే దాకా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఓ ప్లేట్ కి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి గరిటతో స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి.
-తర్వాత మీకు నచ్చిన షేపులో దీనని కట్ చేసుకోవచ్చు. అంతే టేస్టీ రాగి బర్ఫీ రెడీ. రాగి బర్ఫీని గాలి చొరబడని డబ్బాలో 3-4 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వారం రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
