Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
పాత కాలంలో ఉక్కులాంటి మనుషులు తిన్న ఆహారం ఇదే..కోటి రూపాయలు పెట్టినా ఇప్పుడు దొరకట్లేదు,ఎలా చేయాలంటే
పూర్వం జనాలు చాలా స్ట్రాంగ్ గా ఉండేవాళ్లు..ఎన్ని గంటలు అయినా అలుపు లేకుండా పొలం పనులు చేసేటోళ్లు అని మనం వింటుంటాం. అయితే ఆ శక్తంతా వారికి వారు తినే ఫుడ్ నుంచే వచ్చిందని చెబుతుంటారు. అంత స్ట్రాంగ్ గా, ఫుల్ యాక్టివ్ గా ఉండటానికి వారు తిన్న ఫుడ్స్ లో శెనగల పటోలి కూడా ఒకటి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే శెనగల పటోలీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ రెసిపి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
శెనగల పటోలీ తయారీకి కావాల్సిన పదార్థాలు
శెనగలు-100 గ్రాములు
పచ్చిమిర్చి- 2-3
పసుపు- 1/4 టేబుల్ స్పూన్
ఉప్పు- తగినంత
కరివేపాకు- 2 రెబ్బలు
ఎండుమిర్చి-2
ఉల్లిపాయ-1 పెద్దది
జీలకర్ర-1/4 టేబుల్ స్పూన్
ఆవాలు-1/4 టేబుల్ స్పూన్
మినపప్పు-1/4 టేబుల్ స్పూన్

శెనగల పటోలీ తయారీ విధానం
-శెనగల పటోలీ తయారుచేయడానికి ముందుగా రాత్రంతా శెనగలను నానబెట్టాలి.
-రాత్రంతా నానబెట్టిన శెనగలను మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మినపప్పు,ఆవాలు,జీలకర్ర,ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేగిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోండి.
-తర్వాత ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి బాగా మగ్గిన తర్వాత గ్రైండ్ చేసిన శెనగల మిశ్రమాన్ని ఇందులో వేసి కలపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి.
-బాగా ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని దించేయండి. అంతే శెనగల పాటోలి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
