రోజుకో లడ్డు,రోగాలకు చెక్..చక్కెర,బెల్లం లేకుండానే డ్రై ఫ్రూట్ లడ్డు..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ముఖ్యంగా తీపి పదార్థాల విషయానికి వస్తే చక్కెరకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పండుగలు వచ్చినా, శుభకార్యాలు జరిగినా తీపి లేనిదే ఆనందం సంపూర్ణం కాదు. ఇక్కడే షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, దీనిలో వాడిన ప్రతి పదార్థం పోషకాల గని. రోజుకు ఒక లడ్డు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Traditional Taste with a Healthy Twist Step by Step Sugar Free Laddu Recipe in Telugu

కావలసిన పదార్థాలు
ఖర్జూరం: 2 కప్పులు
బాదం పప్పు: అర కప్పు
జీడిపప్పు: అర కప్పు
పిస్తా: పావు కప్పు
వాల్ నట్స్: పావు కప్పు
కిస్మిస్: 2 టేబుల్ స్పూన్లు
గసగసాలు: 2 టేబుల్ స్పూన్లు
ఎండు కొబ్బరి తురుము: 2 టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: అర టీస్పూన్
నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా బాదం, జీడిపప్పు,పిస్తా,వాల్ నట్స్ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-ఖర్జూరాన్ని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌ లా చేసుకోవాలి లేదా చాలా సన్నగా తరిగినా పర్వాలేదు.

-తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో గసగసాలను వేసి నూనె లేకుండానే తక్కువ మంటపై దోరగా వేయించాలి. అవి చిటపటలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో ఎండు కొబ్బరి తురుము వేసి దానిని కూడా కొద్దిగా వేయించి పక్కన పెట్టండి.

-ఇప్పుడు అదే పాన్‌ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ వేసి దోరగా వేయించాలి. ఇవి బంగారు రంగులోకి మారి మంచి వాసన వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్‌ లోకి తీసుకోవాలి. కిస్మిస్ ను చివరగా వేసి ఉబ్బే వరకు వేయించి తీయాలి.

-స్టవ్ మీద ఉన్న పాన్‌ లో మిగిలిన నెయ్యి వేసి మెత్తగా చేసుకున్న ఖర్జూరం పేస్ట్‌ ను వేయాలి. సన్నని మంటపై ఖర్జూరం పేస్ట్ మెత్తబడి, ముద్దగా అయ్యే వరకు సుమారు 2-4 నిమిషాలు వేయించాలి.

-ఖర్జూరం పేస్ట్ మెత్తబడ్డాక స్టవ్ ఆపివేయండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు, గసగసాలు, యాలకుల పొడిని ఖర్జూరం మిశ్రమంలో వేసి బాగా కలపాలి. వేడి మీద ఉన్నప్పుడే గరిటెతో లేదా చేతితో మొత్తం మిశ్రమం కలిసేలా చూసుకోవాలి.

-మిశ్రమం కొద్దిగా చల్లారి, చేతితో పట్టుకునే వేడి ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకోవాలి. ఈ లడ్డులను పూర్తిగా చల్లారనివ్వాలి. అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన షుగర్ ఫ్రీ డ్రై ఫ్రూట్ లడ్డులు రెడీ.

-వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే 15-20 రోజుల వరకు తాజాగా ఉంటాయి.

[ of 5 - Users]
Story first published: Monday, January 5, 2026, 17:04 [IST]
Desktop Bottom Promotion