మిగిలిపోయిన అన్నంతో పాలక్ పనీర్ రైస్..100కి 200 మార్కులు ఇవ్వొచ్చు..ఎలా చేసుకోవాలంటే

Posted By:

పాలక్ పనీర్ రైస్ అనేది రుచికరమైన, పోషకమైన వంటకం. ఇది పాలకూర, పనీర్ తో తయారు చేయబడిన భారతీయ వంటకం. పాలకూరలోని ఐరన్, విటమిన్స్, మినరల్స్..అలాగే పనీర్ ‌లోని ప్రొటీన్‌లు, కాల్షియం వంటి పోషకాల కలయికతో ఈ వంటకం చాలా ప్రయోజనకరమైనది. ఈ రెసిపీని తయారు చేయడం చాలా సులభం. ఇది వారం రోజులలో ఎప్పుడైనా తినడానికి అనుకూలంగా ఉంటుంది. మిగిలిపోయిన అన్నంతో కూడా దీనిని తయారుచేసుకోవచ్చు. పిల్లలకు పెద్దలకు లంచ్ బాక్సుల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూశారంటే అస్సలు వదిలిపెట్టరు. పాలక్ పనీర్ రైస్ ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

పాలక్ పనీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు

-పాలకూర
-బాస్మతి బియ్యం లేదా మిగిలిపోయిన అన్నం
-నెయ్యి
-నూనె
-జీలకర్ర
-ఎండుమిర్చి
-వెల్లుల్లి
-పచ్చిమిర్చి
-ఉల్లిపాయ
-ఉప్పు
-కారం
-ధనియాల పొడి
-కొత్తిమీర
-కసూరి మేథీ
-పనీర్ క్యూబ్స్
-అల్లం తరుగు
-నిమ్మరసం

Transform Leftover Rice Make Mouth Watering Palak Paneer Rice Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా స్వట్ మీద పాన్ పెట్టి అందులో నీళ్లు పోసి అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ చక్కెర, 3 కట్టల పాలకూర(220 గ్రాముల వరకు)వేసి పెద్ద మంట మీద 4-5 నిమిషాలు ఉడికించాలి.

-తర్వాత స్టవ్ ఆపేసి పాలకూర ఆకును చన్నీళ్లలో వేసి అది చల్లారాకా మిక్సీ జారులో వేసి పావుకప్పు నీళ్లు కలుపుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసి 1 టీస్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయల ముక్కలు, 15 వెల్లుల్లిపాయల సన్నని తరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేసి వెల్లుల్లిని కాస్త వేగనివ్వండి.

-వెల్లుల్లి మంచి సువాసన వస్తున్న సమయంలో అందులో 2 పచ్చిమిరపకాయల సన్నని తరుగు, 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేపితే చాలు

-ఇప్పుడు అందులో 200 గ్రాముల పనీర్ క్యూబ్స్, 1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీర తరుగు వేసి 4 నిమిషాలు వేయించాలి.

-తర్వాత అందులో మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ వేసి కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి.

-పసరు వాసన పూర్తిగా పోయిన తర్వాత 1 టీస్పూన్ ధనియాల పొడి,అర టేబుల్ స్పూన్ కారం వేసి వేపాలి.

-పాలకూర ఉడికిన తర్వాత ఇందులో గంటన్నర సేపు నానబెట్టి ఉప్పు, నూనె వేసి వండిన బాస్మతి రైస్ లేదా మిగిలిపోయిన అన్నం పాన్ లో వేయాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీర తరుగు, కొద్దిగా నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి,1 టేబుల్ స్పూన్ కసూరి మేథీ నలిపివేసి పెద్ద మంట మీద మెతుకు చిదిరిపోకుండా కలుపుకోవాలి.ఉప్పు చూసి కావాలనుకుంే వేసుకోండి.

-అన్నాన్ని మెత్తం పాలక్ కి పట్టించాక స్టవ్ ఆపి మూతపెట్టి పావు గంట వదిలేయండి. తర్వాత మూత తీస్తే ఘుమఘుమలాడే పాలక్ పనీర్ రైస్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, July 20, 2025, 10:56 [IST]
Desktop Bottom Promotion