Latest Updates
-
2030 నాటికి హెపటైటిస్ వైరస్ నిర్మూలనే లక్ష్యం.. కానీ లివర్ ఆరోగ్యానికి ముందున్న సవాళ్లు ఇవే.! -
గుత్తి వంకాయ కర్రీ అంటే ఎర్రగానే ఉండాలా.. పచ్చికారంతో ఇలా చేస్తే దానికి మించిన రుచి ఉండదు.! -
మీ బాత్రూమ్లో ఈ ఒక్క వస్తువు ఉంచితే చాలు.. డబ్బు కష్టాలు తొలగినట్లే.! -
రొటీన్ టిఫిన్స్‌కి బదులుగా సొరకాయతో ఇలా కొత్త రకం బ్రేక్‌ఫాస్ట్.. తింటే రుచి జన్మలో మరిచిపోలేరు.! -
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.! -
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ! -
మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా! -
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.! -
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి! -
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్‌లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్‌తో ఇక ఆ సమస్యే ఉండదు.!
కాసింత ఘాటుగా, కొంచెం వేడిగా.. ఈ సూప్‌ను రోజుకోసారి తాగారంటే ఇట్టే బరువు తగ్గొచ్చు.!
సీజన్ ఏదైనా జొన్న పిండి, రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్, బీపీ వ్యాధిగ్రస్తులు జొన్నలు, రాగులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో వర్షాకాలంలో ఘాటుగా, రుచిగా, వేడిగా ఇలా జొన్న పిండితో సూప్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఇది బెస్ట్ ఆప్షన్.

జొన్న పిండి సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు
నూనె లేదా నెయ్యి- రెండు టీ స్పూన్లు
జీలకర్ర- అర టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్- అర టీస్పూన్
ఉల్లిపాయ- రెండు టేబుల్ స్పూన్లు
క్యారెట్ ముక్కలు- రెండు టేబుల్ స్పూన్లు
టమాటా ముక్కలు- రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు- రెండు రెబ్బలు
నీళ్లు- అర లీటర్(500 ml)
ఉప్పు- రుచికి సరిపడా
మిరియాల పొడి- అర టీస్పూన్
జొన్నలు- పావుకప్పు
కొత్తిమీర- కొద్దిగా
నిమ్మరసం- రెండు టీస్పూన్లు
జొన్న పిండి సూప్ తయారీ విధానం
ముందుగా జొన్నలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. లేదా ఇంట్లో జొన్న పిండి సిద్ధంగా ఉన్నా సరిపోతుంది. రెండు స్పూన్ల జొన్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి నెయ్యి లేదా నూనె వేసి కాగనివ్వాలి. ఇందులో జీలకర్ర, అప్పడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు కలుపుకోవాలి.

తర్వాత ఇందులో ఉల్లిపాయ, క్యారెట్, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. టమాటా మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. అవసరమైతే పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, క్యాబేజ్ ముక్కలను కూడా మితంగా వాడుకోవచ్చు. కాస్త కరివేపాకు వేసి మరోసారి కలుపుకోవాలి.
అన్నీ వేగిన తర్వాత అర లీటర్ నీళ్లు పోసి మరగనివ్వాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తాజా మిరియాల పొడిని వేసి కలపాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు తడిపిన జొన్న పిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకొని ఉడకనివ్వాలి. చిక్కగా అనిపిస్తే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు.
ఇది ఇద్దరికి సరిపోతుంది. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే అందుకు అనుగుణంగా నీళ్లు, పిండి తీసుకోవచ్చు. చివర్లో కొత్తిమీర, నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
హెల్తీ జొన్న పిండి సూప్ రెడీ. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు ఈ సూప్‌ను చిన్నారుల నుంచి పెద్దల వరకు తాగొచ్చు. రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు.. అధిక బరువును నియంత్రించవచ్చు. డయాబెటిస్, బీపీ రోగులు ఈ సూప్‌ను తరచుగా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications