Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఉగాది స్పెషల్..ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ క్రంచీ బేబీ కార్న్ 65..వాహ్ అనిపించే బెస్ట్ స్టార్టర్!
ఉగాది అయినా, ఇతర పండుగలు అయినా ఇళ్లలో స్వీట్స్ ఘుమఘుమలాడుతుంటాయి. అయితే స్వీట్స్ తిన్న తర్వాత కాస్త కరకరలాడే హాట్ స్నాక్స్ తింటే ఆ మజాయే వేరు.
పెళ్లిళ్లు, ఫంక్షన్లలో స్టార్టర్ గా వడ్డించే కరకరలాడే బేబీ కార్న్ 65 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది చూస్తేనే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే. బేబీ కార్న్ 65ను ఉగాది సందర్భంగా మన ఇంట్లోనే చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

బేబీ కార్న్ తయారీకి కావలసిన పదార్థాలు
బేబీ కార్న్ - తగినన్ని (నిలువుగా కట్ చేసుకున్నవి)
మైదా పిండి - 2 టేబుల్ స్పూన్లు
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి) - 2 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం పొడి - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు
గరం మసాలా పొడి - అర టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
మిరియాల పొడి -అర టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు - కొద్దిగా
రెడ్ ఫుడ్ కలర్ - చిటికెడు
ఉప్పు -సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
బేబీ కార్న్ 65 తయారీ విధానం
-ముందుగా బేబీ కార్న్ ను శుభ్రం చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో బేబీ కార్న్ ముక్కలు వేసి 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి, నీళ్లన్నీ వంపేసి ముక్కలను చల్లారనివ్వాలి.
-ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్ వేయాలి. దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి సరిపడా ఉప్పు కలపాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు, రెడ్ ఫుడ్ కలర్ వేసి అన్నీ కలిసేలా పొడిగానే ఒకసారి కలుపుకోవాలి.
-తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ, పిండిని కలుపుకోవాలి. పిండి మరీ పల్చగా నీళ్లలా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మనం ఇంట్లో వేసుకునే బోండా పిండిలా కాస్త జారుగా ఉంటే సరిపోతుంది.
-పిండి మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలను వేసి, ప్రతి ముక్కకూ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 నిమిషాల పాటు అలాగే పక్కన ఉంచితే, మసాలా ఫ్లేవర్స్ అన్నీ బేబీ కార్న్ కు పడతాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా పట్టించిన బేబీ కార్న్ ముక్కలను ఒక్కొక్కటిగా విడివిడిగా నూనెలో వేయాలి. అవి కరకరలాడుతూ ఎర్రగా మారేంతవరకు మీడియం మంట మీద వేయించుకోవాలి.
-అంతే నోరూరించే బేబీ కార్న్ 65 రెడీ. దీనిపై కొద్దిగా నిమ్మరసం పిండుకుని, ఉల్లిపాయ ముక్కలతో తింటుంటే ఆ మజానే వేరు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
