Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
రోజుకో ఉసిరి లడ్డు.. వంద రోగాలకు చెక్!..ఎలా చేసుకోవాలంటే..
రోజుకో ఉసిరికాయ తింటే ఆయుర్వేద డాక్టర్ ఇంటికి రానక్కర్లేదు అనేది సామెత. ఉసిరికాయలో మన ఆరోగ్యానికి మేలు చేసే బోలెడు పోషకాలు ఉంటాయి. పూర్వకాలంలో మన పెద్దవాళ్లు సీజనల్ గా వచ్చే అనారోగ్యాల నుండి రక్షణ పొందడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి ఉసిరిని ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకునేవారు. అందులో అత్యంత రుచికరమైనది, పిల్లలు కూడా ఇష్టంగా తినేది ఉసిరి లడ్డు.
ఈ లడ్డు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, జీర్ణ ప్రకియ మెరుగవుతుంది, లివర్ డీటాక్స్ అయ్యి హై బ్లడ్ షుగర్ తగ్గుతుంది, మానసిక ఆరోగ్యం కూడా పెరుగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే జుట్టు నుంచి కాలిగోళ్ల వరకు 100 రకాల జబ్బులను ఇది తగ్గిస్తుందని అంటుంటారు. పాతకాలం నాటి ఉసిరి లడ్డు తయారుచేసుకోడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

ఉసిరి లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు:
-ఉసిరికాయలు
-బాదం
-పిస్తా పప్పు
-వాల్ నట్స్
-జీడిపప్పు
-ఎండుకొబ్బరి పొడి
-శొంఠి
-నువ్వులు
-గుమ్మడి గింజలు
-పుచ్చ గింజలు
-తాటి బెల్లం
-కిస్మిస్
-ఖర్జూరం
-నెయ్యి
ఉసిరి లడ్డు తయారీ విధానం:
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో ఒక కప్పు నువ్వులు వేయించి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి.
-తర్వాత ఎండుకొబ్బరి పొడి వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత పాన్ లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసి వేడయ్యాక అందులో ముక్కలుగా చేసిన 2 స్పూన్ల జీడిపప్పు, 2 స్పూన్ల బాదం, 2 స్పూన్ల పిస్తా, 2 స్పూన్ల వాల్ నట్స్, 2 స్పూన్ల గుమ్మడి గింజలు, 2 స్పూన్ల పుచ్చ గింజలు వేసి వేయించాక ఇందులో 2 స్పూన్ల ఖర్జూరం, 2 స్పూన్ల ఎండుద్రాక్ష(కిస్మిస్) వేసి మరో నిమిషం వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
-తర్వాత 10-15 ఉసిరికాయలు కడిగి తడిలేకుండా తుడిచి తురుముకోవాలి.
-స్టవ్ మీద పాన్ లో మరికొంచెం ఆవు నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉసిరికాయ తురుము వేసి తక్కువ మంట మీద 10 నిమిషాలు వేయించాలి. తర్వాత అందులోనే వేయించిన నువ్వులను, కొబ్బరి పొడి, తీపి కోసం తగినంత తాటి బెల్లం వేసి ముద్దగా అయ్యేవరకు కనీసం 10 నిమిషాలు ఉడికించాలి.
-తర్వాత అందులో శొంఠి,యాలకల పొడి, వేయించి పక్కన ఉంచిన డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుకొని స్టవ్ ఆపేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత దాన్ని ఉండలుగా చేసుకోండి. అంతే టేస్టీ, హెల్దీ ఉసిరి లడ్డు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications