Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం..టేస్ట్ అదిరిపోద్ది అంతే..ఎలా చేసుకోవాలో చూడండి
పాయసం అనేది రుచికి, సంస్కృతికి, ఆరోగ్యానికి సమతుల్యతను అందించే అద్భుతమైన వంటకం. కిరిసి పాయసం అనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ముఖ్యంగా శ్రీకాకుళం,విజయనగరం జిల్లాల్లో ప్రసిద్ధి చెందిన ఒక సాంప్రదాయక, ప్రత్యేకమైన పాయసం. పండుగలు,ప్రత్యేక సందర్భాల్లో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో దీనిని తప్పనిసరిగా చేస్తారు. కృష్ణా,గుంటూరు ప్రాంతాల్లో చేసే పాల తాలికలను ఇది పోలి ఉంటుంది. ఉత్తరాంధ్ర స్పెషల్ కిరిసి పాయసం మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవచ్చో ఇక్కడ చూడండి.
కిరిసి పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-బియ్యం
-చక్కెర
-పచ్చి కొబ్బరి
-నానబెట్టిన 1 టీస్పూన్ పాలు
కిరిసి పాయసం తయారీ విధానం
ఒక గ్లాసు బియ్యాన్ని కనీసం 2 గంటలు నానబెట్టాలి.
తర్వాత మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసి,ఇందులోనే అర గ్లాసు పాలలో గ్లాసున్నర నీళ్లు కలిపిన దాంట్లో సగం మిక్సీలో వేసి మొత్తం గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పిండి మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసుకోండి. ఇందులోనే మిగిలిన పాలను కూడా వేసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను తక్కువలో ఉంచి దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టి అందులో 6 గ్లాసుల పాలు, 1 గ్లాసు చక్కెర, గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి స్టవ్ ఆన్ చేసి పాలను మరిగించాలి.
పాలు మరిగేలోగా కీర్సాట మెషీన్(వాంపూస వత్తుకోడానికి వాడేటువంటుది) కి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి.
ఉడికించిన పిండి మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని కీర్సాట మెషీన్ లోని గుంటలో పెట్టి స్టవ్ మీద పాలలోనే నొక్కుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చాక మళ్లీ ఇంకొంచెం పిండి మిశ్రమాన్ని మెషీన్ లో పెట్టి పాలలో వత్తుకోవాలి. దీనివల్ల ఒకటికొకటి అంటుకోకుండా పొడి పొడిగా వస్తాయి. మంటను మళ్లీ సిమ్ లో పెట్టేయాలి.
గరిట పెట్టకుండానే గుడ్డతో గిన్నెను పుట్టుకొని అటు ఇటూ తిప్పాలి. తర్వాత ఇందులో రెండు గంటల పాటు నానబెట్టిన 1 టీస్పూన్ పాలను వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా గరిటతో కలబెట్టుకొని స్టవ్ ఆపేయండి. అంతే కిరిసి పాయసం రెడీ. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications







