క్యారెట్ పచ్చడి

Carrot Pachadi
భోజనంలో పచ్చడి ఉంటే ఆ మజాయే వేరు. ముఖ్యంగా మన ఆంధ్రులకి పచ్చళ్లంటే మహా ప్రీతి. గోంగూర, కొత్తిమీర, పుదీనా, వంటి ఆకు కూలతోనే కాకుండా ముల్లంగి, బెండకాయ, క్యారెట్, పొట్లకాయ, దొడకాయ, బీరకాయ, క్యాబేజి వంటి కూరగాలతో చేసుకునే పచ్చళ్లయితే రుచితో పాటు, ఆరోగ్యకరం కూడా. ఓ సారి ప్రయత్నించి చూడండి....క్యారెట్ తో ఎక్కువగా స్వీట్స్, సలాడ్స్, కూరలు ఇవే చేస్తుంటాము. క్యారెట్, కొత్తిమీర, కొంచెం పచ్చికొబ్బరి కలిపి చేసే ఈ పచ్చడి వెరైటీగా ఉంటుంది. కొంచెం తీయగా, కొంచెం కారంగా అన్నంలోకి, టిఫిన్స్ లోకి కూడా బావుంటుంది. ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే బావుంటుంది. కారం తక్కువ. తినేవారు మిర్చి తక్కువగా వేసుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:
క్యారెట్లు: 1/2kg
కొబ్బరి తురుము: 1
పచ్చిమిర్చి: 10
కొత్తిమీర: 1కట్ట
నిమ్మరసం: 1
మిరియాలు: 1
ఆవాలు: 1
జీలకర్ర: 1
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత

తయారు చేయు విధానం:
1. ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి తురుమి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, కొత్తిమీర, మిరియాలు, పచ్చిమిర్చి ముక్కులను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేడిచేసి, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా కరివేపాకు వేయాలి.
4. తర్వాత వెంటనే అందులో ముద్దుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న ముద్దను వేయాలి. ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. నూనె పైకి తేలేవరకూ వేయించి దించేసుకోవాలి. ఈ పచ్చడి దోశెల్లోకి చాలా బాగుంటుంది.

Story first published: Tuesday, June 12, 2012, 15:54 [IST]
Desktop Bottom Promotion