Latest Updates
-
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే! -
ఢిల్లీలో మండుతున్న ఎండలు! వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి -
రాత్రి పప్పు మిగిలిపోయిందా? అయితే ఉదయం ఇలా కమ్మని పరాఠా చేసుకోండి!
చట్ పట్ ఆలూ రిసిపి-కిడ్స్ స్పెషల్
పిల్లలకు ఎల్లప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వాలని తల్లులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా, బ్రేక్ ఫాస్ట్, లంచ్ విషయంలో చాలా మూడీగా ఉంటారు. పిల్లలు ఆరోగ్యకరంగా తినడానికి హెల్తీ ఆహారాన్ని తయారుచేయడం కొంచెం కష్టమైన పని అనిపిస్తుంది. వారు హెల్తీ మీల్స్ కంటే, టేస్టీ ఫుడ్స్ నే ఎక్కువగా ఇష్టపడుతారు కాబట్టి. పిల్లలు ఎప్పుడూ మృదువైన ఆహారాలను ఇష్టపడరు. వారు ఎప్పుడూ స్వీట్స్ మరియు ట్యాంగీ ఫుడ్స్ ను ఎక్కువగా ఇష్టపడుతారు.
మరి అటువంటి పిల్లల కోసం ఒక హల్తీ వంటకాన్నీ ఈ రోజు మీముందుంచుతున్నాం. ఈ వంటను చట్ పట్ ఆలూ అని పిలుస్తారు. చట్ పట్ అంటే ఇది కొంచెం పుల్లగా ఉంటుంది . ఈ రిసిపిని వివిధ రకాల మసాలా దినుసులను ఉపయోగించి తయారుచేస్తారు. ట్యాంగీ టేస్ట్ కోసం, ఇందులో డ్రై మ్యాంగో పౌడర్ ను మిక్స్ చేస్తారు. ఈ చట్ పట్ రిసిపి పిల్లలకు టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా హెల్తీ కూడా..మరి మీ పిల్లలకోసం దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
బేబీ పొటాటో: 205gms(ఉడికించి, పొట్టు తీసినవి)
ఎండుమిర్చి: 2tsp(మద్యకు కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు:10
రోస్ట్ చేసిన జీలకర్ర: 2tsp
డ్రై మామిడి పొడి: 2tsp
మిరియాల పొడి: 1tsp
బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా
ఆయిల్: 2tbsp
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగి పెట్టుకోవాలి)
నీళ్ళు : 1/4cup
తయారు చేయు విధానం:
1. ముందుగా అల్లం వెల్లుల్లి, రోస్ట్ చేసిన జీలకర్ర, ఎండుమిర్చి, పెప్పర్ పౌడర్ కొద్దిగా నీళ్ళు పోసి, పేస్ట్ లా తయారుచేసుకొని పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో బాయిల్డ్ పొటాటో వేసి 5నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. బేబీ పొటాటో బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
3. తర్వాత అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకొన్న అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్, మ్యాంగో పౌడర్, బ్లాక్ సాల్ట్ వేసి మరో 3,4నిముషాలు వేగించుకోవాలి.
4. ఇప్పడు అందులో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి మరో 5-10నిముషాలు ఉడికించుకోవాలి.
5. ఒకసారి ఉడికిన తర్వాత మంటను తగ్గించి తర్వాత కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే చట్ పట్ ఆలూ రిసిపి రెడీ. దీన్ని చపాతీ మరియు బ్రెడ్ కు మంచి కాంబినేషన్.



Click it and Unblock the Notifications











