Latest Updates
-
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు! -
వేసవి తాపాన్ని తీర్చే చల్లని పచ్చి మామిడి ఐస్ క్రీమ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
30 రోజులు పరగడుపున ధనియాల నీళ్లు తాగితే... మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే!
క్యారెట్-కుకుంబర్ రైతా(క్యారెట్ పెరుగు పచ్చడి): హెల్తీ సైడ్ డిష్
ఇండియన్ స్పెషల్ వంటకాల్లో క్యారెట్ పెరుగు పచ్చడి కూడా ఒకటి. ఇది సైడ్ డిష్ గానే కాదు. స్పెషల్ గా తయారు చేసుకొని గీ రైస్, జీరా రైస్, ప్లెయిన్ రైస్, రోటీలకు ఓ అద్భుతమైన కాంబినేషన్. ఆంధ్రా స్టైల్లో కొంచె స్పెషల్ గా, పెప్పర్, అల్లం చేర్చి వండటం వల్ల ఓ స్పెషల్ టేస్ట్ వస్తుంది.
ఇండియన్ వంటకాల్లో రైతా చాలా ఫేమస్ సైడ్ డిష్. సాధారణంగా రైతాను నీళ్ళు-చిలికిన పెరుగు మిశ్రమం, కొన్ని స్పైసీ(మసాలా దినుసుల)తో తయారు చేస్తారు. రైతాకు మసాలాలను కలిపుకొని తయారు చేసుకోవచ్చు. లేదా తాజా కూరగాయలు ఉల్లిపాయలు, టమోటోలు, కీరకాయ, అవొకాడో వంటివి మిక్స్ చేసి కూడా తయారు చేసుకోవచ్చు. అంతే కాదు, బూందీ చేర్చి స్వీట్ రైతాను కూడా తయారు చేసుకోవచ్చు. రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు క్యారెట్ రైతాను చాలా సార్లు చేసుకొని ఉంటారు. అందుకే మసాలాదినుసులతో తయారు చేసే రైతా ఎలా ఉంటుందో మీరూ తాయారు చేసి రుచి చూడండి....

కావలసిన పదార్థాలు:
క్యారట్ తురుము : 1/2cup
కీరదోసకాయ : 1/2cup(తురుము లేదా ముక్కలు)
పెరుగు : 2cup
పచ్చి మిర్చి : 4(మిక్సీలో వేసి మెత్తగా చేయాలి)
శనగపప్పు : 1tsp
మినప్పప్పు : 1tsp
ఆవాలు : 1tsp
జీలకర్ర : 1/2tsp
ఎండు మిర్చి : 6
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
ఉప్పు : తగినంత
ధనియాల పొడి : 1/2tsp
జీలకర్ర పొడి : 1/2tsp
నూనె : 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి కాగాక క్యారట్ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి.
2. తర్వాత గిన్నెలో పెరుగు, ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు వేసి గిలక్కొట్టాలి.
3. ఇప్పుడు మరో డ్రీఫ్ ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి కాగాక అందులో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర , ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి వేయించాలి.
4. అంతులోపు చిలకించిన పెరుగులో... వేయించి ఉంచుకున్న క్యారట్ తురుము వేసి కలపాలి.
5. తర్వాత అలాగే వేయించి ఉంచుకున్న పోపు కూడా జోడించాలి.
6. ఇప్పుడు కీరదోసకాయ ముక్కలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేయాలి. అంతే క్యారెట్ రైతా రెడీ. ఇది అన్నంలోకి, రోటీలలోకి బాగుంటుంది.



Click it and Unblock the Notifications











