Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆకుకూరతో కచోరి హెల్తీ క్రిస్పీ బ్రేక్ ఫాస్ట్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను ఆకుకూరతో తయారు చేయడం అంటే కొంచెం కష్టమైన పనే. అయితే ఒక సారి ఆకుకూర ఉపయోగించి కచోరీలు తయారు చేయడం వల్ల ఒక సారి రుచి చూస్తే.. మళ్ళీ ఈ టేస్ట్ ను వదిలిపెట్టరు. కచోరి అనేది నార్త్ ఇండియన్ వైపు పాపులర్ స్నాక్. సింపుల్ డీప్ ఫ్రై ఇండియన్ బ్రెడ్. ఇందులో ఆకుకూర కలపడం వల్ల ఆరోగ్యకరం కూడా...
క్రిస్పి స్పినాచ్ కచోరి తయారు చేయడం చాలా సులభం మరియు ఈ వంటకు ఎక్కువ వస్తువులు కూడా అవసరం లేదు. ఈ గోధుముపిండికి ఆకు కూరను మిక్స్ చేసి డీప్ ఫ్రై చేయడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది . మరి ఈ ఐరన్ రిచ్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఎలా తయారు చేయాలో ఒక సారి పరిశీలించండి...

కావల్సిన పదార్థాలు:
ఆకుకూర: 1కట్ట
గోధుమ పిండి : 2cups
అల్లం: 1tsp
అజ్వైన్: 1tsp
కారం: 1tsp
ఉప్పు : రుచికి సరిపడా
నూనె డీప్ ఫ్రైకి సరిపడా
నీళ్ళు : రెండు కప్పులు
తయారు చేయు విధానం:
1. ముందుగా ఆకుకూరను శుభ్ర చేసి కడిగి ఒక బౌల్లోనికి తీసుకొని కొద్దిగా నీళ్ళు పోసి 5నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి.
2. ఐదు నిముషాల తర్వాత నీరు వంపేసి, ఆకుకూర చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మొత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు ఇక వెడల్పాటి బౌల్ తీసుకొని అందుగోధుమపిండి, అల్లం, కారం సీడ్స్, ఉప్పు, కారం, మరియు పేస్ట్ చేసుకొన్న ఆకుకూర వేసి బాగా మొత్తగా అన్ని కలగలిసేలా కలుపుకోవాలి.
4. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని మెత్తగా పిండిని కలిపి పెట్టుకోవాలి.
5.తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు ఆయిల్ ను డీప్ ఫ్రైయింగ్ పాన్ లో వేసి బాగా కాగనివ్వాలి.
7. నూనె కాగిన తర్వాత కచోరి బాల్ ను ఒక్కొక్కదాన్ని అరచేతిలో పెట్టుకొని కచోరిలా(లేదా వడలా)వత్తుకొని కాగే నూనెలో వేసి రెండు మూడు నిముషాలు డీప్ ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట మీద అన్ని వైపులా కాలేవిధంగా వేగించుకోవాలి.
8. కచోరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉండి తర్వాత తీసి పేపర్ టవల్ మీద వేయాలి. ఎక్సట్రా ఆయిల్ ఉంటే వడిగిపోతుంది. ఇలానే మిగిలిన అన్ని కచోరిలను వేగించుకోవాలి. అంతే ఆకుకూర కచోరి రెడీ. మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications











