For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లక్నోవీ దమ్ ఆలూ

|

ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. దమ్ ఆలూ పంజాబీయుల స్పెషల్ రిసిపి. చాల రుచికరంగా ఉంటుంది

అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు. ఇక రెస్టారెంట్లలో ఐతే ఇండియన్ మసాలా ధినుసులు, కొబ్బరి తురుము, టమోటో కెచప్ తో ఘాటుగా తయారు చేస్తారు. చాలా మంది ఇంట్లో తయారు చేసేటప్పుడు, టమోటో కెచప్ కు బదులు, టమోటో గుజ్జును ఉపయోగిస్తారు. టమోటో కెచప్ చేర్చడం వల్ల కొద్దిగా తియ్యగా.. ఇండియన్ మసాలలు చేర్చడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ రోటీకు చాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్..మరి లక్నోవీ ఆలూ దమ్ ఎలా తయారు చేస్తారా చూద్దాం రండి....

Lucknowi Dum Aloo

కావలసిన పదార్థాలు:
బంగాళ దుంపలు : 1/2kg (ఉడికించి తొక్క తీసి మెత్తగా చేయాలి);
పనీర్ తురుము : 100gms
కారం : 1tsp
ఉప్పు : రుచికి తగినంత
గరం మసాలా : 1tsp
కసూరీ మేథీ : 2tsp
నెయ్యి : 3tsp
బటర్ : 1tsp
క్రీమ్ : 1tbsp

ఉల్లిపాయ గ్రేవీ కోసం:
ఉల్లిపాయలు : 200gms(మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి)
గరం మసాలా : 1/2tsp
ఉప్పు : రుచికి తగినంత
నెయ్యి : 1tsp
టొమాటో గ్రేవీ కోసం:
టొమాటో ప్యూరీ : 200gms
నెయ్యి : 1tsp
ఉప్పు : రుచికి తగినంత

తయారుచేసే పద్దతి:

1. ఉల్లిపాయ గ్రేవీ తయారీ:
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కాగాక, ఉల్లిపాయ ముద్ద వేసి గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాలి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి.

2. టొమాటో గ్రేవీ తయారీ:
మరొక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక టొమాటో ప్యూరీ వేసి చిక్కబడే వరకు వేయించాక, ఉప్పు వేసి బాగా కలిపి దించేయాలి.

3. దమ్ ఆలూ తయారీ:
బంగాళదుంపల తొక్కు తీసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి

4. తర్వాత పాన్ లో నూనె వేసి కాగాక, బంగాళదుంప ముక్కలను వేసి కరక రలాడేలా వేయించి, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక దించి చల్లార్చాలి.

5. ఇప్పుడు ఒక పాత్రలో ముందుగా ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళ దుంప ముద్ద, పనీర్ తురుము వేసి కలిపి పక్కన ఉంచాలి.

6. చివరగా ఒక బాణలిలో నూనె వేసి కాగాక, టొమాటో గ్రేవీ, ఉల్లిపాయ గ్రేవీ మిశ్రమాలు వేసి నూనె బాగా పైకి తేలే వరకు వేయించాలి.

7. అలాగే అందులో గరం మసాలా, కారం, కసూరీ మేథీ వేసి కలిపి, రెండు నిమిషాలు ఉడికించాలి. అంతే లక్నోవీ దమ్ ఆలూ రిసిపి రెడీ

English summary

Lucknowi Dum Aloo

Aloo dum is one of the most popular main Course Indian dishes. Aloo dum is prepared by many methods at different places. For example, in West Bengal, posto (khus lhus) is used to make the gravy of the aloo dum thick.
Story first published: Saturday, December 6, 2014, 16:54 [IST]
Desktop Bottom Promotion