Latest Updates
-
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్! -
ఎండల తీవ్రతతో అల్లాడుతున్నారా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే ఈ వేసవిలోనూ మీరు కూల్‌గా ఉండొచ్చు!
స్వీట్ అండ్ స్పైసీ పొటాటో పెప్పర్ ఫ్రై
వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతోంది ఈ ఫర్ ఫెక్ట్ వాతారణానికి ఫర్ ఫెక్ట్ గా ఆహారం తీసుకోవాలని అనిపిస్తున్నదా? చలికి కారంగా ఏదైనా సైడ్ డిష్ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అయితే స్పైసీగా మరియు స్వీట్ గా ఆలూ పెప్పర్ ఫ్రై ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్.
స్వీట్ అండ్ స్పైసీ పొటాటో పెప్పర్ ఫ్రై సైడ్ డిష్ చాలా సులభంగా, సింపుల్ గా తయారుచేయవచ్చు. చాలా తక్కువ మసాలా దినుసులతో క్రిస్పీగా కరకరలాడే ఆలూ ఫ్రై సాంబార్, రసం, చారు వంటి మీల్ డిష్ కు ఫర్ ఫెక్ట్ సైడ్ డిష్ గా నప్పుతుంది. అంతే కాదు, మెత్తగా ఉండే పూరిలకు భలే రుచిగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ ఈజ్ ఆలూ పెప్పర్ ఫ్రై ఎలా తయారుచేయాలో చూద్దాం...
కావల్సిన పదార్ధాలు:
బంగాళ దుంపలు: 4
పెప్పర్ కార్న్(మిరియాలు): 15(చూర్ణం)
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా తరిగినవి)
మెంతులు(మెంతి): ½tsp
పసుపు ½tsp
నెయ్యి: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: ½ tsp

తయారుచేయు విధానం:
1. బంగాళదుంపలను ప్రెజర్ కుక్కర్ లో వేసి రెండు విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత వాటిని బయటకు తీసి, పొట్టు తీసి కావల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు స్టౌమీద పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో మొంతులు, పెప్పర్ పౌడర్, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అందులో ఉడికించిపొట్టు తీసి పెట్టుకొన్న బంగాళదుంప ముక్కలు వేసి మీడియం మంట మీద 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత మరికొద్దిగా పప్పెర్ పౌడర్ ను, పసుపు, ఉప్పు వేసి చిలకరించి మొత్తం కలగలిసేలా 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. మరింత రుచికరంగా ఉండటం కోసం చివరగా కొద్దిగా పంచదారను చిలకరించి కలిపి దింపుకోవాలి. అంతే పెప్పర్ పొటాటో ఫ్రై రెడీ. ఇది పూరీలకు చాలా టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications











