For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుదీనా చట్నీ : ఇండియన్ ఫుడ్ రిసిపి

|

చట్నీ లేదా పచ్చడి పాపులర్ ఇండియన్ సైడ్ డిష్. పచ్చడి లేని భోజనం... చేవచచ్చిన జీవితం. అంటుంటారు. ఎందకంటే మనిషన్నాక ఉప్పకారం తినాలి అంటారు అందుకు. ఉప్పు, కారం, పులుపు బాగా పట్టించి తయారు చేసే ఈ పచ్చళ్ళు రుచితో పాటు రంగు, వాసనలు కూడా అద్భుతంగా ఉంటాయి.

పచ్చళ్ళు రోటి, రైస్, చాట్స్, స్నాక్స్ , బ్రేక్ ఫాస్ట్ వంటివాటికి చక్కటి కాంబినేషన్. అంతే కాదు... బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లల్లో ముఖ్యమైనవి కొత్తిమీర, పుదీనా, టమోటో పచ్చళ్ళు. పుదీనా చట్నీ చేస్తే గది మొత్తం ఘుమఘుమలాడాల్సిందే.

మన రెగ్యులర్ వంటకాల్లో పుదీనాను ఎందుకు చేర్చుకోవాలి

అంతే కాదు సూపర్ టేస్ట్ కూడా.. అంతే కాదు, ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాల వల్ల దీన్ని ఏసీజన్లో తీసుకొన్న కొన్ని బాడీఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు. మరి ఈ హెల్తీ అండ్ టేస్టీ పుదీనా చట్నీ ఎలా తయారుచేయాలో చూద్దాం...

Pudina Chutney - Indian Food Recipe

కావల్సిన పదార్థాలు:
ఫ్రెష్ గా ఉండే పుదీనా: రెండు కట్టలు: 1 cup(శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి)
కొబ్బరి తురుము 1/2cup
పచ్చిమిర్చి: 2-3
వెల్లులి రెబ్బలు: 4

వేసవితాపానికి బెస్ట్ మెడిసన్ ఫ్రెష్ పుదీనా జ్యూస్
ఫ్రెష్ జింజర్ (అల్లం): 1 cup
కొత్తిమీర తరుగు: 1/4 cup
ఉప్పు: రుచికి సరిపడా
పంచదార: 1/4 tsp
చింతపండు రసం: 1 tsp
నీళ్ళు: సరిపడా

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

తయారుచేయు విధానం:
1. ముందుగా పుదీనా శుభ్రంగా కడిగి, కట్ చేసి పెట్టుకోవాలి. నీరు మొత్తం వడలిపోయే వరకూ పక్కన పెట్టుకోవాలి
2. తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక, మొదట పచ్చిమిర్చి వేగించి పక్కన పెట్టుకోవాలి.
3. అదే నూనెలో పుదీనా మెత్తబడే వరకూ మీడియం మంట మీద వేగించుకోవాలి. మద్యమద్యలో కలియబెట్టడం వల్ల పాన్ కు అట్టుకోకుండా ఉంటుంది.
4. తర్వాత కొబ్బరి తురుమును కూడా వేసి ఒకనిముషం లైట్ గా వేగించుకోవాలి.

పుదీనా ఆకులతో బాడీ మరియు స్కిన్ బెనిఫిట్స్
5. ఇప్పుడు వేగించుకొన్నపదార్థాలను మిక్సీ జార్లో వేయాలి,. వీటితో పాటు లిస్ట్ లో ఉన్న మిగిలిన పదార్థాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
6. స్టౌ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
7. అంతే టేస్టీ అండ్ హెల్తీ గ్రీన్ పుదీనా చట్నీ రెడీ. అవసరం అయితే పోపులో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ ఇండియన్ గ్రీన్ చట్న, వేడి వేడి దోస, ఇడ్లీ, చపాతీ, మరియు సమోసాలకు గ్రేట్ కాంబినేషన్.

English summary

Pudina Chutney - Indian Food Recipe

This Indian food recipe will help working woman in a great way as it can be made over the weekend and relished on all the days of the week with various Indian breads like dosas, idlis and also with plain rice. If you are wondering as to which is that recipe then here it is, the tasty and tangy "Pudina Chutney Recipe".
Story first published: Monday, January 25, 2016, 13:12 [IST]
Desktop Bottom Promotion