Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
స్వీట్ వెజిటబుల్ బాత్

కాలీఫ్లవర్ పువ్వు చిన్నది: 1
బీన్స్: 1cup
కాప్సికమ్: 1
ఉల్లిపాయ: 2
పైనాపిల్ స్లైసెస్: 5
రైస్‌ఫ్లోర్: 2tsp
నూనె: తగినంత
ఉప్పు: రుచికి సరిపడా
క్యారెట్: 2
టమోటా కెచెప్: 2tsp
చిల్లీసాస్: 2tsp
ఆరెంజ్ జ్యూస్: 2tsp
చింతరసం: 1tsp
తయారుచేయు విధానం:
1. కాలీఫ్లవర్ పూలను కొద్దిగా కాడతో తుంచుకోవాలి. వాటిని ఉప్పునీటిలో కాని వేడినీటిలో వేసుకుని 15నమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని బయటకు తీసి కొద్ది సేపు ఆరబెట్టాలి.
2. కేరెట్ ముక్కలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలను రౌండ్ గా కట్ చేసుకోవాలి. కాప్సికమ్ ను కూడా చిన్నవిగా పొడవుగా కట్ చేసుకోవాలి.
3. కార్న్ ఫ్లోర్ కొంచెం వేడి నీటిలో కలుపుకుని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. స్వీట్ పేస్ట్ కొంచెం చేయాలి. అందులో స్టౌ పై పాన్ పెట్టి అందులో తగినంత నూనె వేసి వేడి చేసి అందులో కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసి అందులో ఈ స్వీట్ పేస్ట్‌ని వేసి కలుపుకోవాలి.
4. తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. అన్నింటిని సన్నని సెగ మీద వేగనివ్వాలి. 10నిమిషాల తర్వాత దించుకుని చల్లారనివ్వాలి.
5. స్వీట్ వెజిటబుల్ పేస్ట్ బజారులో దొరుకుతుంది. అది ఈ మగ్గిన కూరగాయలలో, కార్న్ ఫ్లోర్ పేస్ట్ వేసి కలపాలి. మళ్లీ అన్నింటిని కలిపి ఒక గిన్నెలో వేసుకుని 2 లేక 3 నిమిషాలు స్టౌ మీద మూతపెట్టి వుడకనివ్వాలి.
6. ఉడికిన తర్వాత దించుకుని పైన చెప్పిన స్వీట్ పేస్ట్ వేయాలి. దాని మీద టమోటా కెచెప్, చిల్లీసాస్, ఆరెంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, చింత పండు రసం వీటన్నింటిని కలిపి ఒక గిన్నెలో పోసుకుని బాగా కలుపుకోవాలి.
7. కూరలు ఉడికిన తర్వాత దించుకుని అందులో పైన చెప్పిన వన్నింటినీ కలిపి పోసుకుని 2,3 నిమిషాలు స్టౌ మీద ఉంచాలి. మొత్తం దించుకుని ఆ మొత్తాన్ని ఒక వెడల్పాటి డిష్ లోకి వంచుకుని పైన ఈ మిగిలిన పేస్ట్ ని వేసుకుని కలుపుకోవాలి. ఇది తియ్యగా, కారంగా, పుల్లగా ఎంతో టేస్ట్ గా ఉంటుంది.



Click it and Unblock the Notifications











