గ్లుటేన్-ఫ్రీ సింగపూర్ వెర్మిసెల్లి నూడుల్స్

By: LAKSHMI BAI PRAHARAJU
Subscribe to Boldsky

బియ్యంపిండి, నీరు కలిపి చేసే ఈ రైస్ నూడుల్స్ తూర్పు, ఆగ్నేయ ఆసియా వంటకాలకు చాలా ముఖ్యమైనది. రైస్ నూడుల్స్ లో సహజంగా గ్లుటేన్ ఉండదు, కొలియాక్ వ్యాధి లేదా గ్లుటేన్ సెన్సిటివిటీ తో బాధపడుతున్న వారికి ఇది సురక్షితమైన ఎంపిక.

ఎంతో తేలికైన థాయి ఫ్రైడ్ రైస్ నూడుల్స్ డిష్ చాలా రుచిగా ఉంటుంది, తయారుచేయడం చాలా తేలిక. దీన్ని వెర్మిసెల్లి రైస్ నూడుల్స్ అని కూడా పిలుస్తారు, దీన్ని మదం నూడుల్స్ ని ఉపయోగించి చేస్తారు. ఇది చాలా రుచితో కూడుకుని ఉండడమే కాకుండా సాంప్రదాయ నూడుల్స్ అనుభూతి కంటే చాలా తేలికైన భావన కలుగుతుంది.

vermicelli noodles
వెర్మిసెల్లి నూడుల్స్ I వెర్మిసెల్లి నూడుల్స్ ని ఎలా తయారుచేస్తారు I గ్లుటేన్ ఫ్రీ సింగపూర్ స్టైల్ వెర్మిసెల్లి నూడుల్స్ ని ఎలా తయారుచేస్తారు
వెర్మిసెల్లి నూడుల్స్ I వెర్మిసెల్లి నూడుల్స్ ని ఎలా తయారుచేస్తారు I గ్లుటేన్ ఫ్రీ సింగపూర్ స్టైల్ వెర్మిసెల్లి నూడుల్స్ ని ఎలా తయారుచేస్తారు
Prep Time
20 Mins
Cook Time
20M
Total Time
40 Mins

Recipe By: షెఫ్ చూంగ్ చ్యూ లూన్

Recipe Type: స్నాక్స్

Serves: 4

Ingredients
 • వెర్మిసెల్లి నూడుల్స్ - 250 గ్రాములు

  సోడియం రెడ్యూసేడ్ సోయా సాస్ - 3 టేబుల్ స్పూన్లు

  పంచదార నూక - 2 టీస్పూన్లు

  వెజిటబుల్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు

  క్యాబేజ్ ముక్కలు - 2 కప్పులు

  సన్నగా తరిగిన స్వీట్ రెడ్ పెప్పర్ - 1

  సన్నగా తరిగిన క్యారెట్ - 1

  లవంగాలు - 2

  వెల్లుల్లి రెబ్బలు - 2

  ఉప్పు - రుచికి సరిపడా

  మిరియాల పొడి - రుచికి సరిపడా

Red Rice Kanda Poha
How to Prepare
 • 1.ఒక పెద్ద బౌల్ లో, వెర్మిసెల్లి నూడుల్స్ తీసుకోండి.

  2.గోరువెచ్చని నీటిలో వెర్మిసెల్లి నూడుల్స్ ను నానపెట్టండి.

  3.నూడుల్స్ ని నేతిలో 5 నిమిషాల పాటు నాననివ్వండి.

  4.ఇపుడు, నూడుల్స్ ని ఒక బౌల్ లో వడకట్టండి.

  5.నూడుల్స్ ని ఒక పక్కన పెట్టండి.

  6.ఒక చిన్న బౌల్ తీసుకుని, అందులో సోడియం రెడ్యూసేడ్ సోయా సాస్, షుగర్ కలపండి.

  7.¾ కప్పుల నీటిని పోయండి.

  8.ఇపుడు, సోయా సాస్, షుగర్, నీటిని వడకట్టి కలపండి.

  9.కొన్ని నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టండి.

  10.ఒక బౌల్ రూపంలో ఉన్న ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో నూనె వేయండి.

  11.కొద్ది మంటపై ప్యాన్ లోని నూనెను వేడిచేయండి.

  12.సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలను వేడినూనె ఉన్న ప్యాన్ లో కలపండి.

  13.కొద్దిగా గోధుమరంగు, వాసన వచ్చే వరకు తక్కువ మంటపై అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేయించండి.

  14.ప్యాన్ లో సోయా సాస్, పంచదార, నీటిని సగమే కలపండి.

  15.అల్లం, వెల్లుల్లితో త్వరగా ఒకచోట చేర్చి కలపండి.

  16.ఉండలు రాకుండా ఉండేట్టు, తక్కువ మంటపై ఉడికించండి.

  17.సాస్ లో బుడగలు వచ్చే వరకు ఉడికించండి.

  18.ఇపుడు, సన్నగా తరిగిన రెడ్ పెప్పర్, క్యారెట్, క్యాబేజ్ కలపండి.

  19.తక్కువ మంటపై కూరగాయలను 2 నిమిషాల పాటు సాట్ చేయండి.

  20.అందులో నీరు పోయేంతవరకు కూరగాయలను ఉడికించండి.

  21.ఈ సమయంలో, కూరగాయలు ఎక్కువ ఉడకాకుండా చూసుకోవాలి.

  22.నానపెట్టి, వడకట్టిన నూడుల్స్ ని ఈ కూరగాయలలో కలపండి.

  23.మిగిలిన సాస్ ని ప్యాన్ లో వేయండి.

  24.రెండు చెంచాలు లేదా గరిటల సాయంతో మొత్తం బాగా కలపండి.

  25.నూడుల్స్ మొత్తం సాస్ లో కలిసే వరకు, ప్యాన్ లో బాగా కలియపెట్టండి.

  26.సర్వింగ్ ప్లేట్ లో, నూడుల్స్ ని తరిగిన రెడ్ పెప్పర్, క్యారెట్ ముక్కలను ఉపయోగించి గార్నిష్ చేయండి.

Instructions
 • 1.కూరగాయలను ఎక్కువసేపు ఉడికించొద్దు.
Nutritional Information
 • సర్వింగ్ సైజ్ - 1 బౌల్
 • క్యాలరీలు - 800
 • కొవ్వు - 4 గ్రాములు
 • కార్బోహైడ్రేట్లు - 384 గ్రాములు
[ 4.5 of 5 - 77 Users]
Subscribe Newsletter