Latest Updates
-
టీ, కాఫీకి బదులుగా ఒక కప్పు ఇది తాగారంటే.. తలనొప్పి, నీరసం పరార్.! -
మీలో నిజంగా ఆత్మవిశ్వాసం ఉందా.. ఈ ఐదు పాయింట్లు ఉంటే మీకు తిరుగే ఉండదు.! -
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి!
Vinayaka chavthi Recipe : గణనాథుడికి ఇష్టమైన నైవేద్యం..రవ్వ ఉండ్రాళ్లు చేయండిలా..
వినాయక చవితి రాగానే బొజ్జ గణపయ్యకు రకరకాల నైవేద్యాలు చేసి పెడుతుంటారు. రకరకాల స్వీట్లు, ఆహారాలు తయారుచేసి గణనాథుడికి సమర్పిస్తుంటారరు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన వంటకాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అయితే దాదాపు అన్ని చోట్లా వినాయకుడికి ఉడుములు, కుండ్రాళ్లను తప్పనిసరిగా పెడుతుంటారు.
వినాయక చవితికి ప్రసాదంగా తెలుగువాళ్లు ఎక్కువగా రవ్వ ఉండ్రాళ్లను తయారుచేస్తుంటారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14న వినాయక చవితి జరుపుకుంటున్న సందర్భంగా రవ్వ ఉండ్రాళ్లను మీ ఇంట్లో ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

రవ్వ ఉండ్రాళ్లు తయారీకి కావాల్సిన పదార్థాలు
-బియ్యం రవ్వ
-నెయ్యి
-పచ్చి శెనగపప్పు
-జీలకర్ర
-నీళ్లు
-ఉప్పు
-అల్లం తురుము
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా..
రవ్వ ఉండ్రాళ్లు తయారీ విధానం
-రవ్వ ఉండ్రాళ్ల తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 1 కప్పు బియ్యం రవ్వని సన్నని సెగ మీద వేయించాలి. రవ్వ వేగాక దాన్ని ఓ ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
-తర్వాత అదే బాండీలో మూడున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. మరుగుతున్న నీళ్లలో నెయ్యి,జీలకర్ర, నానబెట్టుకున్న పచ్చి శెనగపప్పు లేదా పెసరపప్పు, ఉప్పు, అల్లం తురుము వేసి ఎసరుని బాగా తెర్లనివ్వాలి.
-తెర్లుతున్న ఎసరులో వేపుకున్న రవ్వని పోసి కలిపి మూతపెట్టి మీడియం మంట మీద అన్నం వండినట్లుగా దగ్గరగా వండుకోవాలి.
-ముద్దగా అయ్యాక స్టవ్ ఆపేయండి.
-ఇప్పుడు ఒక పళ్లెంలో నెయ్యి రాసుకోండి. ఉడికించిన రవ్వ మిశ్రమాన్ని పళ్లెంలో వేయండి.
-తర్వాత చేతికి నెయ్యి రాసుకొని రవ్వ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా చేతుల్లోకి తీసుకొని ఉండలుగా చేసుకోండి.
-స్టవ్ మీద ఆవిరి పాత్ర పెట్టి అందులో ఈ ఉండలు పెట్టి 7-8 నిమిషాలు ఆవిరి మీద ఉడికించి స్టవ్ ఆపేయాలి. అంతే ఉండ్రాళ్లు రెడీ.
-వీటిని బయటకు తీసి నెయ్యితో తడిపి స్వామికి నివేదించండి. తర్వాత వీటిని తింటుంటే అమృతం తిన్న ఫీలింగ్ వస్తది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
