బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ అవ్వాలా? ప్రోటీన్,ఐరన్ పుష్కలంగా ఉండే ఈ దోసె బ్రేక్ ఫాస్ట్ కి బెస్ట్!

Posted By:

ప్రస్తుత బిజీ లైఫ్ లో ఉదయం పూట వంట చేయాలంటే చాలామందికి టైం ఉండదు. ఈ క్రమంలో బయట టిఫిన్స్ షాప్స్ కి వెళ్లి కడుపు నింపుకుంటారు. దీనవల్ల అనారోగ్య సమ్యలను కూడా కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మీకు కూడా ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం పూట ఆరోగ్యకరమైన, రుచికరమైన అల్పాహారం త్వరగా తయారు చేసుకోవడం పెద్ద సవాలుగా మారిందా?

అయితే చాలా ఈజీగా, నిమిషాల్లోనే శనగపప్పు, పాలకూర దోసెను ఓ సారి మీ ఇంట్లో చేసి చూడండి. ఇది కేవలం రుచిలోనే కాదు, పోషకాలలో కూడా రారాజు. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి, షుగర్ ఉన్నవాళ్లకి ఇది ఒక పర్ఫెక్ట్ బ్రేక్‌ ఫాస్ట్. ఫైబర్, ప్రోటీన్లతో నిండిన శనగపప్పు, పాలకూర దోసెను చాలా తక్కువ సమయంలో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Weight Loss Diabetic Friendly Chana Dal Spinach Dosa Recipe in Telugu Quick Healthy Breakfast

శనగపప్పు పాలకూర దోసె తయారీకి కావలసిన పదార్థాలు

నానబెట్టిన శనగపప్పు - 1 కప్పు
తాజా పాలకూర - 1 కప్పు
పచ్చిమిర్చి - 2
అల్లం - 1 అంగుళం ముక్క
జీలకర్ర - 1 టీస్పూన్
ఇంగువ - ఒక చిటికెడు
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె లేదా నెయ్యి - కాల్చుకోవడానికి తగినంత

ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు.. ఇడ్లీలు, దోశలు ఎన్ని తింటారో లెక్కే ఉండదు!

శనగపప్పు పాలకూర దోసె తయారీ విధానం

-ముందుగా 4-5 గంటల సేపు నానబెట్టుకున్న శనగపప్పులోని నీటిని పూర్తిగా వంపేసి మిక్సీ జార్‌ లో వేసుకోవాలి. అందులోనే అల్లం ముక్క, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని, చిక్కటి పిండిలా గ్రైండ్ చేసుకోవాలి.

-గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన పాలకూర, పసుపు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలుపుకోవచ్చు.

-స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ లేదా దోశల పెనం పెట్టి మీడియం మంటపై వేడి చేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నూనె రాసి, ఒక గరిటెడు పిండిని తీసుకుని దోశలాగా గుండ్రంగా, కొంచెం మందంగా పరుచుకోవాలి.

-దోసె అంచుల వెంబడి కొద్దిగా నూనె లేదా నెయ్యి వేయాలి. కింది వైపు చక్కటి బంగారు రంగులోకి మారి కాలిన తర్వాత, నిదానంగా మరోవైపుకు తిప్పి కరకరలాడేలా కాల్చుకుంటే వేడివేడి దోసె రెడీ.

Gas saving tips: గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు!

ఈ దోసె కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

ప్రోటీన్ల పవర్‌ హౌస్
శనగపప్పులో మొక్కల ఆధారిత ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి తోడ్పడటమే కాకుండా, శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందిస్తుంది.

ఐరన్, విటమిన్ల గని
పాలకూరలో ఐరన్, ఫోలేట్, విటమిన్ A, విటమిన్ C అపారంగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించి, శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

బరువు తగ్గేందుకు బెస్ట్ ఛాయిస్
ఇందులో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది తిన్న తర్వాత కడుపు చాలాసేపు నిండిన భావన కలుగుతుంది. దీనివల్ల మాటిమాటికీ ఆకలి వేయదు, చిరుతిళ్లపైకి మనసు మళ్లదు. తద్వారా సులభంగా బరువు తగ్గుతారు.

షుగర్ పేషెంట్లకు బెస్ట్
శనగపప్పుకు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉంటుంది. కాబట్టి ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. మధుమేహం ఉన్నవారికి ఇది చాలా బెస్ట్.

[ of 5 - Users]
Story first published: Saturday, August 22, 2026, 9:18 [IST]
q
Desktop Bottom Promotion