Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
నూనె చుక్క లేకుండా..రుచి,ఆరోగ్యం కలగలిసిన నుచ్చినుండే..ఎలా చేసుకోవాలంటే..
కర్ణాటక రాష్ట్రంలో ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఎక్కువగా తయారుచేసే వాటిల్లో నుచ్చినుండే ఒకటి. ముఖ్యంగా దీపావళి, నాగుల చవితికి దీనిని ఎక్కువగా తయారుచేస్తుంటారు. హెల్దీ, టేస్టీ బ్రేక్ ఫాస్ట్ గా నుచ్చినుండే ఉంటుంది. దీనిని చుక్క ఆయిల్ లేకుండా తయారుచేసుకోవచ్చు. దీనిని బ్రేక్ ఫాస్ట్ లోకే కాకుండా లంచ్ కి లేదా డిన్నర్ కి ఎలా,ఎప్పుడు తిన్నా అద్భుతంగానే ఉంటుంది. కన్నడ భాషలో నుచ్చు అంటే పప్పు అని, ఉండె అంటే ఉండలు అని అర్థం. కాబట్టి నుచ్చినుండే అంటే పప్పు ఉండలు అని అర్థం. కర్ణాటక సంప్రదాయం వంటకం అయిన నుచ్చినుండేను మీ ఇంట్లోనే సింపుల్ గా ెలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
తయారీకి కావాల్సిన పదార్థాలు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-కందిపప్పు
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-పెసరపప్పు
-మిరియాల పొడి
-పచ్చికొబ్బరి తురుము
-జీలకర్ర
-కరివేపాకు
-అల్లం
-కొత్తిమీర
-ఉప్పు

తయారీ విధానం
-ముందుగా ఓ పెద్ద గిన్నె తీసుకొని అందులో పావు కప్పు పచ్చి శెనగపప్పు, పావు కప్పు మినపప్పు పావు కప్పు కందిపప్పు, పావు కప్పు పెసరపప్పు, పావు కప్పులో సగం(2 టేబుల్ స్పూన్ల)బియ్యం, 5 ఎండుమిరపకాయలు వేసి నీళ్లు పోసి కడిగాక అవి మునిగేంత వరకు నీళ్లు పోసి కనీసం 4 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
-తర్వాత నానబెట్టిన నీటిని వంపేసి పప్పుల మిశ్రమం మొత్తాన్ని మిక్సీ గిన్నెలో వేసి పల్స్ చేసుకుంటూ రవ్వ రవ్వగా గ్రైండ్ చేయాలి. నీరు అస్సలు పోయకూడదు.
-గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఓ బౌల్ లోకి తీసుకోండి. ఇందులో 1 టీస్పూన్ దంచిన మిరియాల పొడి, అరకప్పు పచ్చికొబ్బరి తురుము, అరకప్పు ఉల్లిపాయ తరుగు 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ సన్నగా తరిగిన అల్లం, 3 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 రెబ్బల కరివేపాకు తరుగు, 2 పచ్చిమిరపకాయలను మధ్యకు తరిగిన సన్నని చీలికలు,రుచికి సరిపడా ఉప్పు వేసి మొత్తం కలిసేలా చేత్తో గట్టిగా కలుపుతూ పిండుకోవాలి. తర్వాత వీటిని ముద్దులుగా చేసి పెట్టుకోండి.
-అసలు కర్ణాటక స్టైల్ లో అయితే ఇందులో బియ్యం, ఉల్లిపాయ వేయరు. అయితే ఇవి వేసుకోవడం వల్ల చల్లారినా కూడా రుచిగా ఉంటాయి కాబట్టి వేసుకోవచ్చు.
-ఇప్పుడు స్టవ్ మీద ఓ గిన్నెలో నీళ్లు పోసి మరిగించి ఈ గిన్నెమీద ఓ చిల్లుల ప్లేట్ లేదా గిన్నెలాంటి ఉంచుకోండి. ఈ ప్లేట్ లేదా గిన్నెకు ఆయిల్ అప్లమ్ చేపి రెడీ చేసుకున్న ముద్దలను దీనిమీద పెట్టి మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి.మీకు కావాలనుకుంటే ఇడ్లీ పాత్రలో అయినా ఈ ముద్దలను పెట్టి ఉడికించుకోవచ్చు. టూత్ పిక్ తో గుచ్చి చూసి ఉడికితే దించేయాలా. అంతే నుచ్చినుండే రెడీ.
-రెడీ అయిన నుచ్చినుండెలను మజ్జిగపులుసు లేదా పెరుగు సంబంధ వంటకాలతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
