Latest Updates
-
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది?
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు!
దహీ భల్లా పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది.. పెరుగు, చట్నీల కలయికతో నోరూరించే పుల్లటి, తియ్యటి రుచి. పండుగైనా, ఇంట్లో చిన్న పార్టీ అయినా లేదా సాయంత్రం వేళ ఏదైనా చాట్ తినాలనిపించినా దహీ భల్లా బెస్ట్ ఆప్షన్. కానీ ఈ భల్లాలను నూనెలో డీప్ ఫ్రై చేయడం వల్ల కేలరీలు ఎక్కువగా ఉంటాయని, బరువు పెరుగుతామనే భయంతో ఈ మధ్యకాలంలో చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు.
అయితే ప్రముఖ డైటీషియన్ దీపికా కుందల్వాల్ ఒక్క చుక్క కూడా నూనె వాడకుండా ఆవిరి (స్టీమ్) మీద ఉడికించి చేసే అద్భుతమైన దహీ భల్లా రెసిపీని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. ఇది జీర్ణం కావడానికి చాలా తేలికగా ఉండటమే కాకుండా కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
దహీ భల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు
-మినపప్పు
-అల్లం
-పచ్చిమిర్చి
-ఇంగువ
-ఉప్పు
-పెరుగు
-జీలకర్ర పొడి
-కారం
-బ్లాక్ సాల్ట్
దహీ భల్లా తయారీ విధానం
-ముందుగా మినప పప్పును శుభ్రంగా కడిగి కనీసం 7-8 గంటలు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి. పప్పు బాగా నానిన తర్వాత నీరు వంపేసి మిక్సీలో వేయాలి. దానికి రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క చేర్చి మెత్తటి, చిక్కటి పేస్ట్ లా రుబ్బుకోవాలి.
-రుబ్బుకున్న పిండిని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని ఒకే దిశలో కనీసం 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా గిలకొట్టాలి ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి తేలికపడుతుంది. అప్పుడే భల్లాలు స్పాంజిలా చాలా మెత్తగా వస్తాయి.
-మామూలుగా అయితే ఈ పిండిని నూనెలో వేయిస్తారు. కానీ మనం ఇడ్లీ ప్లేట్లకు లేదా చిన్న గిన్నెలకు కొద్దిగా నూనె రాసి, ఈ పిండిని అందులో వేయాలి. ఇడ్లీ పాత్రలో నీరు మరిగించి, ఈ ప్లేట్లను అందులో పెట్టి మూతపెట్టాలి. మీడియం మంట మీద 10-12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి.
-ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు ఇంగువ, సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. ఆవిరి మీద ఉడికించిన భల్లాలను ఈ నీటిలో వేసి 10-15 నిమిషాలు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల భల్లాలు మరింత మెత్తబడటమే కాకుండా మంచి సువాసన వస్తాయి.
-నీటిలో నానిన భల్లాలను చేత్తో సున్నితంగా నొక్కి, అదనపు నీటిని తీసేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. వాటిపై ముందుగా గిలకొట్టి పెట్టుకున్న చిక్కటి పెరుగును ఉదారంగా వేయాలి. ఆ తర్వాత తీపి చింతపండు చట్నీ, కారం కారంగా ఉండే పుదీనా చట్నీ వేయాలి. పైన వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా కారం, నల్ల ఉప్పు చల్లాలి. మరింత రుచి కోసం దానిమ్మ గింజలు, సన్నటి సేవ్ చల్లుకుంటే అద్భుతమైన దహీ భల్లా రెడీ.
ఈ పద్ధతి ఎందుకు బెస్ట్?
నూనెలో వేయించినవి తిన్న తర్వాత కడుపు ఉబ్బరంగా, బరువుగా
అనిపిస్తుంది. కానీ ఈ ఆవిరి భల్లాలతో ఆ సమస్యే ఉండదు. వర్క్ ఫ్రమ్
హోమ్ చేసేవారికి, ఫిట్ నెస్ ఫాలో అయ్యేవారికి ఇది పర్ఫెక్ట్
స్నాక్.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications








