Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
నూనె చుక్క కూడా లేకుండా..నీటితోనే క్రిస్పీ పూరీలు..కొలెస్ట్రాల్ భయం లేకుండా కుమ్మేయండి
ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది తమకు ఎంతో ఇష్టమైన పూరీలకు దూరంగా ఉంటున్నారు. నూనెలో డీప్ ఫ్రై చేసిన పూరీలు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతామని భయపడి.. అయిష్టంగానే రోటీ లేదా పుల్కాతో సరిపెట్టుకుంటారు.
కానీ మనసు మాత్రం ఆ క్రిస్పీ పూరీల వైపే లాగుతుంది. ఎప్పుడైనా కంట్రోల్ తప్పి రెండు పూరీలు లాగిస్తే.. ఆ తర్వాత అజీర్తి లేదా గ్యాస్ సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కానీ ఆయిల్ చుక్క లేకుండా నీటితోనే క్రీస్పీ పూరీలు తయారుచేసుకోవచ్చని మీకు తెలుసా? అది సాధ్యమే. నూనె చుక్క వాడకుండా, నీటి సహాయంతో క్రిస్పీ పూరీలను ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసి, కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండిని కలపండి. పూరీ పిండి మరీ మెత్తగా కాకుండా, కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
-పిండిని బాగా పిసికిన తర్వాత, ఒక శుభ్రమైన తడి గుడ్డతో దానిని కప్పి సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వల్ల పిండి నానుతుంది,పూరీలు బాగా వస్తాయి.
-నానిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో వీటిని పూరీల్లా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా, కొంచెం మందంగా ఉండేలా చూసుకోండి.
-స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాన్ లేదా బాండీలో నీటిని మరిగించండి.
-నీరు బాగా మరుగుతున్నప్పుడు మీరు ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా ఆ నీటిలో వేయండి.పూరీలు ఒకదానికొకటి అతుక్కోకుండా చూసుకోండి. సుమారు 2-3 నిమిషాల పాటు వాటిని నీటిలో ఉడకనివ్వాలి.
-అవి ఉడికిన తర్వాత నీటిపైకి తేలడం మీరు గమనిస్తారు. అప్పుడు వాటిని మెల్లగా తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టండి.
-ఇప్పుడు అదే వేడి నీటి గిన్నెపై ఒక చిల్లుల గిన్నెను లేదా చిల్లుల ప్లేట్ ఉంచండి. నీటిలో ఉడికించిన పూరీలను (ఒకేసారి 2-3 మాత్రమే) ఆ చిల్లుల గిన్నెపై ఉంచి, మూత పెట్టండి. సుమారు 2-3 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. దీనివల్ల పిండి పూర్తిగా ఉడుకుతుంది. తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసుకోండి.
-ఇప్పుడు మీ ఎయిర్ ఫ్రైయర్ ను 180 డిగ్రీల వద్ద ప్రీ-హీట్ చేయండి. ఆవిరిలో ఉడికించిన పూరీలను ఎయిర్ ఫ్రైయర్ లో ఉంచి, సుమారు 4 నిమిషాల పాటు వేయించండి. కొద్దిసేపటికే పూరీలు నూనెలో వేయించినట్లే చక్కగా ఉబ్బి, బంగారు రంగులోకి మారి క్రిస్పీగా తయారవుతాయి.
-అంతే ఎంతో ఆరోగ్యకరమైన, నూనె లేని పూరీలు రెడీ. వీటిని మీకిష్టమైన ఆలుగడ్డ కూరతో లేదా చోలే మసాలాతో వేడివేడిగా వడ్డించండి.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
