Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ధైర్య సాహసాలకు మరోపేరు మమతా దీదీ...!

ఈమె రెండు మార్లు రైల్వే శాఖ మంత్రిగాను, బొగ్గు, మానవ వనరుల అభివృధ్ధి, క్రీడలు, మహిళా శిశు సంక్షేమ మంత్రిగాను కేబినెట్ లో పదవీ భాధ్యతలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు సేకరించిన ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు వ్యతిరేకంగా వ్యవసాయదారుల తరపున పోరాటం సాగించి విజయం పొందారు.
1997వ సంవత్సరంలో మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీనుండి విడివడి ఆల్ ఇండియా త్రిణమూల్ కాంగ్రెస్ ను స్ధాపించి దానికి ఛైర్ పర్సన్ గా వ్యవహరించారు. 1999 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ప్రభుత్వంలో రైల్వే శాఖా మంత్రిగా పదవి నిర్వహించారు. అక్టోబర్ 2005 లో ఆమె రాష్ట్రంలోని భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని రైతుల తరపున అండగా నిలిచారు.2006 నవంబర్ లో బెనర్జీ సింగూరు లోని టాటా మోటార్ కార్ ప్రాజెక్టు భూముల సేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడారు.
2009 పార్లమెంటరీ ఎన్నికలలో ఆమె యుపిఎ లో భాగస్వామ్య పార్టీగా చేరారు. కూటమి 26 సీట్లు గెలవడంతో ఆమె సెంట్రల్ కేబినెట్ లో రెండవ మారు రైల్వే మంత్రిగా చేరారు. 2011 లో బెనర్జీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భారీ మెజారిటీతో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఓడించి 34 సంవత్సరాల కమ్యూనిస్టుల పాలనకు స్వస్తి చెప్పారు. పశ్చిమ బెంగాల్ కు ప్రస్తుత 11వ ముఖ్యమంత్రిగాను రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్యమంత్రిగాను పదవీ భాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో తొమ్మిది ప్రధాన శాఖలకు అధినేత్రిగా వ్యవహరిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాలలో అనేక విజయాలు సాధించి పాలన సాగిస్తూ మకుంటం లేని మహారాణిగా చెలామణి అవుతున్నారు. రాబోయే సంవత్సరాలలో మమత మరిన్ని విజయాలను సాధించి దేశ, రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతుందని ఆశిద్దాం!



Click it and Unblock the Notifications