Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఓ మహోన్నత మాతృమూర్తి.. నీకు మనాసారా వందనం...!
మదర్స్ డే రోజున పిల్లలు వివిధ రకాలుగా తమ మాతృ మూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. గ్రీటింగ్ కార్డులు, కానుకలు అందించడం ద్వారా అమ్మపై ఉన్న ప్రేమను పిల్లలు వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని కానుకలు ఇచ్చి

మరి అలాంటి మాతృ మూర్తులందరికీ ఈ మే 13న మాతృ దినోత్సవం (మదర్స్ డే) సందర్భంగా మా హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన భారతదేశంలో మదర్స్ డేను గడచిన పది సవంత్సరాలుగా జరుపుకుంటున్నారు. ప్రపంచీకరణ, పాశ్చాత్య పోకడలు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, సింగరపూర్, మలేషియా తదితర ఇతర దేశాల్లో మన దేశీయులు అధికంగా ఉండడం, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్నెట్, శాటిలైట్ విప్లవం వంటి కారణంగా ఈ మదర్స్ డే వేడుకలను మన దేశంలో కూడా జరుపునేందుకు దోహదం చేశాయని చెప్పవచ్చు.
మదర్స్ డే రోజును ఇతర దేశాల్లో మాదిరగానే ఇక్కడ కూడా జరపుకోవటం జరుగుతుంది. ప్రత్యేకిం ఆ రోజున పిల్లలు తమ తల్లులకు బహుమతులు ఇవ్వటం, పెద్దవాళ్లు తమ తల్లిదండ్రులతో ఆ రోజంతా సంతోషంగా గడపటం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం మే నెలలోని రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. మన నిండు నూరేళ్ల జీవితానికి ఆరంభం అయిన అమ్మను ఆరోజున అందరూ స్మరించుకోవడం జరుగుతుంది. మనదేశంలో కూడా మదర్స్ డే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది. మనకోసం అహర్నిశలూ శ్రమించి, మన బంగారు భవిత్యానికి మార్గం చూపే మన తల్లి కోసం జరుపునే ఈ 'మదర్స్ డే' పండుగ గురించి అందరికీ తెలియజేసి, అమ్మను గౌరవించండి.
మదర్స్ డే రోజున పిల్లలు వివిధ రకాలుగా తమ మాతృ మూర్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు. గ్రీటింగ్ కార్డులు, కానుకలు అందించడం ద్వారా అమ్మపై ఉన్న ప్రేమను పిల్లలు వ్యక్తం చేస్తుంటారు. ఎన్ని కానుకలు ఇచ్చినా, అమ్మ కోసం ఎంత చేసిన అమ్మ రుణం ఈ జన్మలోనే కాదు మరే జన్మలోనూ తీర్చుకోలేనిది.
అమ్మ అనే పదం త్యాగాలకు ప్రతి రూపం. సృష్టికి మూలం దేవుడు మలిచిన దైవం. మమతాను రాగాల ప్రతిరూపం. తరగనిది తల్లి రుణం... మరి అలాంటి తల్లి దీవెనెలు ప్రతి బిడ్డకు అవసరం. ఈ మదర్స్ డే నాడు గుడికి వెళ్లి కనిపించని దైవానికి నమస్కరించే బదులు, కళ్లముందు మెదిలే కమ్మనైన అమ్మకు నమస్కరించండి చాలు. ముక్కోటి దేవతలు మీ పూజలందుకుంటారు. మదర్స్ డే సందర్భంగా మరోసారి మాతృ మూర్తులందరికీ హృదయపూర్వం శుభాకాంక్షలు తెలియజేస్తూ....



Click it and Unblock the Notifications
