Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
పురుషులలో ఆవేదన... ఎందుకు అధికం?

నార్త్ కరోలినా లోని వేక్ ఫారెస్ట్ యూనివర్శిటీ లో ప్రొఫెసర్ రాబిన్ సైమన్ చేసిన ఒక స్టడీలో పురుషులు మహిళతో గల మంచి సంబంధాలలో బాగా ప్రయోజనం పొందుతారని ఆమే కనుక అతనిని వదలి వేసినా, నిర్లక్ష్య పరచినా ఎంతో బాధ పడతారని తేలింది. దీనికి ఉదాహరణగా అమెరికా దేశ బాక్సర్ మైక్ టైసన్ గురించి చెప్పుకోవచ్చు. అతని మాజీ భార్య వేరొకరితో వుండగా చూసిన మైక్ టైసన్ తాను కఠినాత్ముడైనప్పటికి, ఎంతో మెత్తగా మారిపోయినట్లు ఏడ్చాడట.
మహిళతో గల సంబంధంలో పురుషులు ఎంతో గర్వంగా వుంటారు. ఒక సారి వారు తిరస్కరించబడితే, అంతకు మించిన అవమానం లేదని భావిస్తారు. ఓడిపోయినట్లు, కోల్పోయినట్లు బాధపడతారు. సంబంధం దెబ్బతింటే పురుషుడు మహిళవలే తన అవమానాన్ని వేరొకరికి తేలికగా చెప్పుకోలేడు. కనుక మహిళలకే గుండె రోదన అధికమని పురుషులకు వుండదని చెపటం సరికాదు అంటున్నారు ఈ అంశంలో పరిశోధించిన రీసెర్చర్లు.
పురుషుడు, తన భావాలను రహస్యంగా వుంచుకుంటాడు. ఇక తనలో వాటిని దాచుకోలేక చివరకు బయటపెట్టేస్తాడు. పురుషులు మహిళలవలే బాగా ఏడ్వక పోయినప్పటికి, విచారంలో వుండి, తినకపోవటం, తాగకపోవటం, ఆల్కహాల్ వంటివాటికి అలవాటు పడటం, నిద్రించకపోవడం వంటివి చేస్తారు. ఒకసారి మోసగించబడిన తర్వాత అతను మరోమారు ఏ మహిళకు తన హృదయాన్ని పూర్తిగా అప్పగించడు. ఆపై ప్రతి ఒక్క సంబంధాన్ని ఎంతో అంచనా వేస్తాడు.
గట్టి అనుబంధాలు
పురుషుడు తన మహిళతో అనుబంధం ఏర్పరచుకోవడానికి చాలా సమయం తీసుకుంటాడు. ఒక సారి ఏర్పరచుకొన్న తర్వాత తన మహిళ తన ప్రేమ పరిధి దాటిందంటే, తీవ్రంగా బాధపడతాడు. అంతేకాదు, తన మహిళ తనకంటే ఆకర్షణీయంగా వున్న వ్యక్తితో సంబంధం ఏర్పరచుకుంటే అతను మరింత వ్యక్తిగతంగా విఫలత భావించి అడుగు ముందుకు వేయలేడు.



Click it and Unblock the Notifications
