Latest Updates
-
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
గుండె ఆరోగ్యంతో పాటు బరువును అదుపులో ఉంచే చట్నీ.. వారానికి ఒక్కసారైనా డైట్లో ఉండాల్సిందే.!
తల్లి - కుమార్తెల బంధం ఒక మంచి స్నేహ బంధం!

మరి కొందరు తల్లులు మారుతున్న పరిస్ధితులకనుగుణంగా తమ పిల్లలపట్ల సంబంధాలను ఏర్పరచుకుంటున్నారు. ప్రత్యేకించి తమ కుమార్తెల పట్ల ఈ రకమైన సంబంధాలు వారిని కట్టిపడేస్తున్నాయి. పిల్లలు ఏది కోరితే అది అయినప్పటికి అందులోని సాధక బాధకాలను వివరించి వారికి ఒక స్నేహితగా సలహా సంప్రదింపులనిస్తున్నారు. మరికొంతమంది తల్లులైతే, తమ కుమార్తెలకు డేటింగ్ చిట్కాలు కూడా అందిస్తున్నారు. అదంతా వారి మంచికి మాత్రమే. ఈ రకంగా తల్లి, కుమార్తెల బంధం స్నేహ బంధంగా కూడా పెరిగిపోతోంది.
పిల్లలు ఎంత స్వతంత్రులైనప్పటికి తల్లులను కూడా ప్రధాన నిర్ణయాలలో సంప్రదిస్తున్నారు. దీనికి కారణం వారిమధ్య గల స్నేహ బంధమే. నిస్సంకోచంగా పిల్లలు తమ బాయ్ ఫ్రెండ్ ఎంపికలపట్ల కూడా తల్లులతో మాట్లాడుతున్నారు. ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా వుంచాలి అనే అంశంలో కొన్ని మార్లు తల్లులు ప్రధాన పాత్ర వహిస్తున్నారు. పిల్లలు సైతం వారి నిర్ణయాలను గౌరవిస్తున్నారు. పిల్లల విషయాలలో ఎంత జోక్యం చేసుకున్నప్పటికి తల్లులు తమ పరిధిలో తాము వుంటున్నారు. నేటి తరం యువతులకు తగినట్లుగానే నేటి తరం తల్లులు కూడా తయారయ్యారు. గతంలోని తల్లి బిడ్డల బంధం కంటే నేడు వారిమధ్య స్నేహ బంధం అధికంగా చోటు చేసుకోవడం స్వాగతించదగిన పరిణామమే. లేదంటే, ఈ తరం యువతులకు సలహా సంప్రదింపులకు, వారిని మంచి మార్గంలో నడిపించటానికి గత కాల మూఢ నమ్మకాలు, సాంప్రదాయాలు సరికావు. తల్లులు ఎంత భావావేశాలు కలవారైనప్పటికి పిల్లల విషయంలో హృదయపూర్వకంగా తమ బాగోగులు చూస్తారన్న సంగతి నేటి యువతులకు తెలిసినదే.
పిల్లలు వారు ఎవరిని డేటింగ్ చేస్తున్నారనేది తల్లులకు చెపటం సాధారణమైపోయింది. ఏ ప్రదేశాలకు వెళుతున్నారనేది కూడా తేలికగా చెప్పేస్తున్నారు. పిల్లల ముఖ కవళికలు చూస్తే చాలు తల్లులు వారు చెప్పే అంశాలు గ్రహించగలిగే స్ధితిలో వుంటారు. తల్లి తన పిల్లలకు ఎపుడూ అన్యాయం చేయదు. వారి బాగోగులకై శ్రమిస్తుంది. నేటికి తల్లులు ఎంపిక చేసిన దుస్తులు, ఇతర అలంకరణ సామాగ్రి మాత్రమే వినియోగించే పిల్లలు వున్నారనటంలో సందేహం లేదు. తల్లి, బిడ్డల సంబంధాలు, గతం నుండి నేటి వరకు అనేక మార్పులు చెందుతూ కాలానుగుణంగా ఆధునీకరించబడుతున్నాయి. నేటి తల్లి తన బిడ్డలకు తల్లే కాదు, సమర్ధనీయ, విశ్వసనీయ స్నేహితురాలు కూడాను.



Click it and Unblock the Notifications