Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
మీ గాళ్ ఫ్రెండ్ కి కోపం వస్తే ....?

దయచేసి నన్ను క్షమించు డార్లింగ్ - ఎంత కోపం వున్న గాళ్ ఫ్రెండ్ కైనా ఈ మాటలు చల్లగా చల్లారుస్తాయి. మీరు తప్పు మీదని ఒప్పుకోండి. మీరు చేసిన తప్పుకు సారీ చెప్పేస్తే, మీపై ఆమెకు గౌరవం పెరుగుతుంది. నన్ను క్షమించు అనే మాటలు ఆమె కోపాన్ని క్షనాలలో కరిగించేసి మీపై మరోమారు అభిమానాన్ని కలిగిస్తాయి.
అయిందేదో అయిపోయింది డార్లింగ్ - అయిందేదే అయిపోయింది ఇకపై ఆ తప్పు చేయనని ఆమె మూడ్ మార్చి రిలాక్స్ చేయండి. అవే అంశాలు మైండ్ లో వుంచుకుంటే సంబంధం మరింత పాడవుతుంది. కోపంగా వున్న గాళ్ ఫ్రెండ్ వద్దకు పోయి ఈ మాటలు చెప్పేయండి. ఆమె ముఖం ఎదుట ధైర్యంగా చెప్పలేకపోతూంటే, చిన్న మెసేజ్ ఇచ్చేయండి. ఆ మెసేజ్ కి ఒక స్మైలీ జతచేయటం మరువకండి. ఈ తీరున మీరు ప్రవర్తిస్తే, మీ గాళ్ ఫ్రెండ్ కోపం నిమిషాల్లో మాయం.
ఓ..కే...డార్లింగ్ నేను మనసులో పెట్టుకుంటా? - చేసిన తప్పును మనసులో పెట్టుకుంటానని, మరల అది రిపీట్ చేయనని మీరు ఆమెకు తెలుపండి. వాదించటం లేదా తిరస్కరించటం చేయకండి. అవి మీ తగవును మరింత పెంచుతాయి. తగవు చిన్నదిగా ఆపేయటానికి మీరు ఈ మాటలు అంటే చాలు ఆమె కోపం నియంత్రణలోకి వచ్చేస్తుంది. తాను ప్రాధాన్యత ఇవ్వబడినట్లు ఆమె భావిస్తుంది. కాని ఆమె తప్పు అని తెలిస్తే మీరు ఈ మాటలు వాడకండి. అది ఆమెను మరింత మొండిగా, మీపై ఆధిపత్యం వహించేలా చేస్తుంది.
కోపం వస్తే నీవెంతో హాట్ - అనే మాటలు వాడండి. మీ గాల్ ఫ్రెండ్ చప్పున చల్లారి నవ్వేస్తుంది. ఈ మాటలు చెవిలో గుస గుస లాడాలి. సెకండ్లలో ఆమె కరిగిపోతుంది. ఆమె ముఖంలో చిరునవ్వు వచ్చేస్తుంది. కాని మీరు చెప్పే ఈ మాటలు ఎంతో సహజంగా వుండాలి. లేదంటే, బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం వుంది. ఈ ట్రిక్కు ఉపయోగించి మీ ప్రేమను మరోమారు వెలిగించుకోవచ్చు.
ఈ రీతిగా మీ గాళ్ ఫ్రెండ్ కోపాన్ని చల్లార్చి, అనవసరమైన పట్టుదలలకు పోయి సంబంధాలు చెడగొట్టుకోకుండా చేసుకోవచ్చు. ఆనందించవచ్చు. సూచించిన అంశాలు చాలా చిన్నపాటివే. ఎంతైనా ఆమె మీకు గాళ్ ఫ్రెండ్ అని, మీరంటే పడి చస్తుందనే విషయాన్ని మరువకండి.



Click it and Unblock the Notifications
