Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
తప్పు చేశామనుకునే మహిళ మనసు?

పిల్లలకు తగినంత సమయం కేటాయించలేక పోతున్నామన్న భావన
తమ ఉద్యోగ విధులు, పిల్లల పట్ట వారి భాధ్యతలకు తాము న్యాయం చేయలేకపోతున్నామనే భావన వీరిలో వుంటుంది. పిల్లలగురించి ఆందోళన చెందుతూ మీరు పనిలో వున్నట్లయితే, మీరు పనిలో న్యాయం చేయలేరు. అంతేకాదు, మీ ఆందోళన పిల్లలకూ ఆ సమయంలో న్యాయం చేకూర్చలేదు. మీరు ఏ పనిలో వుంటే ఆ సమయంలో పూర్తిగా నిమగ్నమవండి. పిల్లలతో వుంటే, వారిపట్ల, పనిలో వుంటే పనిపట్ల మీ ఏకాగ్రత వుంచండి. ఆ విధంగా మీకు ఇద్దరిపట్ల ప్రయోజనం చేకూరుతుంది.
బరువు తగ్గటంలేదనే భావన
మహిళలలో 70 శాతం మంది ఎప్పుడో ఒకపుడు తాము బరువు వున్నా లేకపోయినా సరే బరువుగా వున్నామని తగ్గటం కష్టమైపోతోందని భావిస్తారు. మరి మీరు బొద్దుగా లావుగా వుండాలా? లేక స్లిమ్ గా వుండాలా అనేది ఎంచుకోండి. పరిస్ధితి మార్చుకోడానికిజిమ్ లేదా ఇతర వ్యాయామాలకు ప్రయత్నించండి. అది మీ ఎంపిక, వేరెవరినీ ఇందులో తప్పుపట్టటానికి వీలు లేదని గుర్తించండి.
మీ కొరకు మీరు అధికంగా వ్యయం చేస్తున్నారనే భావన
షాపింగ్ పేరుతో తమాషాగా వ్యవహరిస్తూ సొమ్మంతా వ్యయం చేస్తున్నారా? చేసిన తర్వాత పశ్చాత్తాపపడకండి. అయితే, మీరు కొనేముందు, తార్కికంగా కారణాలు ఆలోచిస్తే మీ వ్యయం హేతుబద్ధంగా వుంటుంది. మీ సమయం కూడా సరైన రీతిలో గడిపినట్లవుతుంది. మీరు తప్పు చేశామనే భావన ఉండనవసరం లేదు.
నా భాగస్వామి నాతో సంతోషంగా లేడు.
మీ భాగస్వామి సంతోషంగా వుండటానికి మీరు న్యాయం చేకూర్చడం లేదనుకుంటే, ఒక సారి మీరు ఇరువురూ కూర్చొని ఒక ప్రణాళిక వేసుకోండి. ఒకరికొకరు సమయం ఎలా గడుపుకోవాలనేది నిర్ణయించుకోండి. ప్రవర్తన ఎలా మార్చుకోవాలో, ఇద్దరూ జంటగా ఎలా సంతోషంగా వుండాలో ప్రణాళిక చేసి ఆనందించండి.
ఎల్లపుడూ లేటు అయిపోతున్నామన్న భావన
ఎంత బాగా తయారైనప్పటికి అన్నింటిలో లేట్ అయిపోతున్నామనే భావన వుంటుంది. అందుకుగాను తప్పు చేసినట్లు భావిస్తారు. మీరు అంతా బాగానే తయారైనప్పటికి ఆ రకంగా ఆందోళన చెందటంలో అర్ధం లేదు. మీరు అసలు ఎక్కడకు వెళ్ళాలో, ఏం కొనాలో లేదా ఏం చేయాలనేది ఒక కాగితం పై వ్రాసుకోండి. ఒక సారి మీరు చేయాలనుకున్నది, లేదా చెప్పాలనుకునేది రిహార్సల్ వేసుకోండి. లేదా మీ తల్లి లేదా ఎవరైనా అక్కడ వుంటే వారికి చెప్పండి. మీలో మీరు మధన పడితే ప్రయోజనం లేదు.
బర్త్ డే లు మరచిపోతున్నామనే భావన
కావాలని మీరు మరచిపోరు. రోజూ కనీసం మనం షుమారు 10 నుండి 15 గంటలు పని చేసి ఎన్నో రకాల పనులు నిర్వహిస్తాం. అపుడు మీరు మీకు చేతనైనది చేస్తున్నా అని వివరించుకొని సమర్ధించుకోవాలి. తప్పు భావించాల్సిన అవసరంలేదు. ఎవరైనా మిమ్మల్ని తప్పు పడితే...అది వారి ఇష్టమని తెలుపండి.
తల్లి తండ్రుల బాగోగులు చూడలేకపోతున్నామనే భావన
మహిళలు సాధారణంగా వారి తల్లితండ్రులకు సరైన న్యాయం చేయలేకపోతున్నామని వారు పెద్దవారైపోయారని భావిస్తారు. మీరు ఏం చేసినప్పటికి మీ తల్లితండ్రులు ఆమోదిస్తారనేది గుర్తుంచుకోండి. మీరు చేయగలిగినది తప్పకచేయండి. మీరు ఆనందంగా వుంటారు. వారు కూడా సరైన వారైతే ఆనందంగానే వుంటారు.



Click it and Unblock the Notifications