Latest Updates
-
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.!
మొరటు మగాడంటే మహిళ ఇష్టపడదా?

మొరటుతనం అంటే మగవాడిలో పూర్తి మగతనం వుండటం, దేహ ధారుఢ్యమే కాక, ధైర్యం, మాట కటువు, నడక అన్నింటిలోను రఫ్ గా ఒక సవాలుగా వుండటంగా వుండాలి. సినిమాలలో మగధీర వంటి వాడని చెప్పాలి.
మరి ఈ రోజులలో మహిళలు ఈ రకమైన మగధీరలను ఎందుకు ఇష్టపడటం లేదు?
1. నకిలీ తనం - చాలామంది మహిళలు, పురుషులు నకిలీగా తమ పురుషత్వాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నారు. వాస్తవ పురుషులుగా వుండాలని ఒత్తిడి తెస్తున్నారు. మహిళలు గతంలో వలే, పిరికివారు కాదు. ఇపుడు వారు కూడా సాహస ధైర్యాలను ప్రదర్శిస్తున్నారు.
2. మొరటు పురుషులు, క్రూరత్వం కలిగి వుంటారు - వారిలో వుండే ఆధిపత్య ధోరణి పట్ల మహిళలు నేడు మార్పు చెందారు. వారు అంత కఠినంగా వుంటే, తమ సంబంధం స్ధిరంగా వుండదని భావిస్తున్నారు. చాలామంది మహిళలు, తెగించే మొరటు పురుషుడంటే, ద్వేషిస్తారు. ఎందుకంటే వారు తమ భార్యలను కొట్టటం కూడా చేస్తారని అభిప్రాయం.
3. ప్రేమించలేరు - ఈ రకమైన మొరటు పురుషులు తమను ప్రేమించలేరని, సున్నితం లేకుంటే, ప్రేమ వుండదని మహిళలు భావిస్తారు. నేను వదిలేస్తే, కనీసం అతను ఏడుస్తాడా? అని కూడా మహిళ ప్రశ్నించుకుంటోంది. నాగురించి శ్రధ్ధ చూపుతాడా? నేను జబ్బు పడితే సానుభూతి పొందుతానా? వంటివి ఆమెకుగల సందేహాలు. ఈ కారణంగా వారు మొరటు పురుషులతో సంబంధాలకు ఇష్టపడరు.
4. సరైన తండ్రులుగా వుండలేరు - ఒక పురుషుడు తన భాగస్వామి కొరకు మహిళవైపు చూస్తాడు. కాని ఒక మహిళ అంతకంటే అధికంగా తన కుటుంబం కొరకు కూడా పురుషుడిని వెతుక్కుంటుంది. మహిళకు తనకు పుట్టే పిల్లాడికి మంచి తండ్రి కూడా కావాలని కోరుతుంది. మరి మొరటుగా వుండే పురుషులు ఆమె పెట్టే ఈ తండ్రి పరీకన్షకు నిలువలేరు. ఫలితం తిరస్కారం.
5. వదిలించుకోవడం కష్టం - ప్రతి సంబంధం కూడా పెళ్ళి వరకు రాదు. కనుక మొరటు వాడిని ప్రేమిస్తే అతనిని వదిలించుకోవటం కష్టంగా వుంటుంది. త్వరగా పెళ్ళి చేసుకోడు. చేసుకున్నా సరిగా చూడడు. ఈ సమస్యలన్ని ఎందుకనుకుంటూ ముందుగానే మహిళ మొరటు పురుషుడిని దూరంగా వుంచుతుంది. అతనితో సంబంధం ఆమెకు ఇష్టం ఉండదు.
అసలు వాస్తవం చెప్పాలంటే, మొరటుగా పురుషాహంకారం ప్రదర్శిస్తే, మహిళ పై పైన మెచ్చుకుంటుందే తప్ప, ఆమె తన హృదయపు లోతులలో అటువంటివారికి స్ధానమివ్వలేదనే చెప్పాలి.



Click it and Unblock the Notifications