Latest Updates
-
పిల్లలకు కోడిగుడ్డు పెడుతున్నారా? ఈ తప్పులు అస్సలు చేయకండి! -
2026 వినాయక చవితి ఎప్పుడు? విగ్రహ ప్రతిష్ఠాపన టైమింగ్స్, పూజా ముహూర్తం, నిమజ్జనం తేదీ వివరాలు! -
వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుములు..చాలా ఈజీగా చేసుకోండిలా.. -
జీర్ణశక్తిని పెంచే సూపర్ ఫుడ్..మిగిలిపోయిన అన్నంతో టేస్టీ కొత్తిమీర రైస్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్! -
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు!
తగవులు మాయం...తలపులు ఆహ్లాదం....!
నేటి స్పీడు యుగంలో ఒంటరిగా కూర్చొని యోగాలు, ధ్యానాలు చేయాలంటే ఎవరికైనా కష్టమే. మిమ్మల్ని సాధారణంగా ఎవరూ ఇష్టపడరు. ఎక్కడ చూసినా ఇంటర్నెట్ కనెక్షన్లు, సోషల్ నెట్ వర్కింగ్, ల్యాప్ టాప్ లు వంటివి మీ సెలవులకు సైతం అందుబాటులో ఉండి ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. బెడ్ పై పడుకున్నా సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. రోజులో కొంత సమయం మీరు మీ ప్రేయసి వీటన్నిటికి దూరంగా ఉండాలి.

ప్రత్యేకించి వారమంతా అలసిపోయే వారికి వారాంతంలో ఇద్దరూ కొంత సేపు యోగా ధ్యానం వంటివి కలిసి చేస్తే....ఆ మజాయే వేరుగా ఉంటుంది. యోగా చేయటం మీకు రోజులో కలిగిన అలసట దూరం చేస్తుంది. అది మిమ్మల్ని వాస్తవంలో జీవించేలా చేస్తుంది. ఇక ధ్యానం అనేది అలవాటుగా ఉండాలి లేదంటే, ఏకాగ్రతతో ధ్యానంలో ఉండటం చాలా కష్టం. అయినప్పటికి ప్రయత్నించండి. ప్రేయసి పక్కన కూర్చొని ఉండగా ధ్యానంచేయటం ఎంతో కష్టతరమే. అయినప్పటికి ఇద్దరూ కలసి ధ్యాన పద్ధతి ఆచరించండి. మొదటగా సరిగా ఏకాగ్రతలు కుదరకపోయినా, పోను పోను దానిని సాధిస్తారు. ఇక ఇద్దరి మధ్యా అన్యోనన్యతే. ఏ రకమైన తగవులు, భేధాభిప్రాయాలు కూడా ఉండవు.
మనసు ఆహ్లాదంగా ఉంటే అది మీకు దీర్ఘాయుష్షుకు ఆరోగ్యకర జీవనానినికి దోవతీస్తుంది. మీరు తినే ఆహారాలపట్ల శ్రద్ధ కలిగి ఉండండి. మనసు పెట్టి తినండి. మీకంటూ మీరు కొంత సమయాలను కేటాయించుకోవాలి. ఆరోగ్యకర జీవన విధానం ఒక జంటగా కలసి ఆచరించండి. యోగా, ధ్యానం, మంచి ఆహారం మీ మధ్య ఎంతో అనురాగాలను, ప్రేమను పెంచుతాయి. ధ్యానం అనేది యోగాలో ఒక భాగం అని గుర్తించండి. నేటి రోజులలో మనం యోగాను వేగంగా బరువు తగ్గించేందుకు వాడుకుంటున్నాం. కాని అది ఏకాగ్రత కొరకు డిజైన్ చేయబడింది. యోగులు దానిని ఆచరిస్తూ గంటల కొద్ది సమయాన్ని గడిపి ఆనందించేవారు.
ప్రతిరోజూ ఉదయం వేళ 15 నిమిషాల పాటు కూర్చొని ధ్యానం చేయండి. ఇక రోజంతా మీకు ఎంతో తేలికగా సంతోషంగా గడచిపోతుంది. మీరు చేయాలనుకున్న పనులన్ని చేసి తీరతారు. దీనికి యోగాసనాలు కూడా జత చేయండి. ఇక ఆరోగ్యం, నిగ్రహం మీ స్వంతం. ఒకరితో మరి ఒకరు కలసి యోగాసనాలు వేయండి. అనుభవం అద్భుతంగా ఉంటుంది. మీరు ఏకాగ్రతపై పట్టు సాధించలేకుంటే, మరల మరల దానిని తరచుగా చేస్తూ ఉంటే తప్పక ఫలితం ఉంటుంది. కోపాలు, తాపాలు దూరమవుతాయి. ఒక సారి చేయటం మొదలుపెడితే, ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రోజులో కలిగే చికాకులు దూరం అవుతాయి. ఇప్పటివరకు ఒకరినొకరు సతాయించటం లేదా కలహించటం చేసే వారిలో ఎంతో మార్పు కనపడుతుంది. మీలోని ఆలోచనలు కొత్త రకంగా రూపు దిద్దుకుంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి.
ధ్యానం, యోగాలతో ఒత్తిడి అలసట దూరం అయి, రాత్రి నిద్ర మీకు అమోఘంగా పడుతుంది. అది మిమ్మల్ని సరైన దిశగా నడిపిస్తుంది. జంటలమధ్య అంతకు మించిన ఆనందం మరేముంటుంది?



Click it and Unblock the Notifications
